ఏంది రాముల ఈ దూకుడు?

0

అల్లు అర్జున్ యూట్యూబ్ లో సూపర్ స్టార్ అంటూ మనం అనుకుంటూనే ఉన్నాం. ఆయన సినిమాల ట్రైలర్ లు.. పాటలు.. ఆయన నటించిన డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ లో సెన్షేషన్ ను క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ను కూడా ఆశ్చర్యపర్చేలా వ్యూస్ వచ్చిన సందర్బం ఉంది. అల్లు అర్జున్ నటిస్తున్న అలవైకుంఠపురంలో చిత్రం నుండి నెల రోజుల క్రితం వచ్చిన సామజవరగమన పాట ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్ చేసేలా రాములో రాముల పాట దూకుడు కొనసాగుతోంది.

దీపావళి సందర్బంగా వచ్చిన ‘రాములో రాముల’ పాట కేవలం 24 గంటల్లోనే ఏకంగా 8.3 మిలియన్ ల వ్యూస్ ను ఈ పాట దక్కించుకుంది. ఇప్పటి వరకు ఏ సౌత్ ఇండియన్ పాట కూడా 24 గంటల్లో ఈ స్థాయి వ్యూస్ ను సొంతం చేసుకున్న దాఖలాలు లేవు. అలాగే మోస్ట్ లైక్డ్ వీడియో కూడా ఇదే అని చెప్పుకోవచ్చు. సినిమాపై ఉన్న అంచనాలను పాటలతో అనూహ్యంగా పెంచేస్తున్నారు. థమన్ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ రెండు పాటలు కూడా ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుగా కుమ్మేస్తున్నాయి.

దీపావళికి బన్నీ ఫ్యాన్స్ కు ఈ పాట నిజమైన పండుగ గిఫ్ట్ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. నిన్న మొన్నటి వరకు సామజవరగమన వినిపిస్తూనే ఉంది. కాస్త అది తగ్గుతుందనుకున్న సమయంలో రాములో రాముల అంటూ వచ్చారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న అల వైకుంఠపురంలో సినిమాకు ఈ రెండు పాటలు కూడా అనూహ్యమైన క్రేజ్ ను తెచ్చి పెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే మరియు నివేథా పేతురాజ్ లు నటించారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home