రాములా డబుల్ సెంచరీ నాటౌట్

0

సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా సందడి తగ్గింది.. థియేటర్ల నుండి వెళ్లి పోయింది. అయినా కూడా ఆ సినిమాలోని పాటలు మాత్రం యూట్యూబ్ లో ఇతరత్ర మ్యూజిక్ పోర్టల్స్ లో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సామజవరగమన మరియు రాములో రాముల పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ పాటలు ఆల్ టైం రికార్డులను సొంతం చేసుకున్నాయి. తెలుగులో అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకున్న ఆల్బంగా అల వైకుంఠపురంలో పాటలు నిలిచాయి.

ఇప్పుడు రాములో రాముల పాట మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా 200 మిలియన్ ల వ్యూస్ ను ఈ పాట దక్కించుకుంది. థమన్ స్వరపర్చిన ఈ పాట యూట్యూబ్ లో ప్రేక్షకుల అభిమానాన్ని ఓ రేంజ్ లో పొందుతుంది. సినిమా విడుదల ముందు వరకు పాటల గురించి జనాల్లో చర్చ జరుగుతుంది. కాని సినిమా విడుదల తర్వాత కూడా రాములో రాముల జోరు కంటిన్యూ అవుతూనే ఉంది.

రాములో రాముల డబుల్ సెంచరీ కొట్టి కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. జోరు చూడబోతుంటే ట్రిపుల్ సెంచరీ కూడా కొట్టి బాలీవుడ్ వీడియోలకు పోటీగా నిలిచేలా అనిపిస్తుంది. అల వైకుంఠపురం లో చిత్రం సూపర్ హిట్ అవ్వడం లో కీలక పాత్ర సంగీతంది అనే విషయం ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నాన్ బాహుబలి రికార్డ్ సక్సెస్ ను దక్కించుకుంటే.. పాటలు కూడా అంతకు మించి రికార్డులు సాధిస్తున్నాయంటూ బన్నీ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer