సాంగ్ టీజర్: ఆగం ఐతున్న అల్లు అర్జున్!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ చాలా ముందుగా మొదలుపెట్టారు. కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేసిన ‘సామజవరగమన’ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. కాసేపటి క్రితం ఈ సినిమా నుంచి మరో పాట ‘రాములో రాములా’ పాట టీజర్ ను విడుదల చేశారు.

ఈ పాటను అక్టోబర్ 26 వ తారీఖున విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రాములో రాములా పాటకు సాహిత్యం అందించినవారు కాసర్ల శ్యామ్. పాడినవారు అనురాగ్ కులకర్ణి.. మంగ్లి. “రాములో రాములా నన్నాగం జేసిందిరో.. రాములో రాములా నా పానం తీసిందిరో” అంటూ ఒక బిట్ మాత్రమే ఈ టీజర్ లో చూపించారు. తెలంగాణా పదాలతో ఫన్నీ టోన్ లో ఈ పాట సాహిత్యం రాసినట్టుగా అనిపిస్తోంది. విజువల్స్ కూడా ఏదో ఫంక్షన్ సాంగ్ తరహాలో బ్రైట్ గా ఉన్నాయి. అల్లు అర్జున్ పూజ హెగ్డేలతో పాటుగా సుశాంత్ కూడా స్టెప్పులు వేయడం విశేషం. పాట కూడా ఫుట్ టాపింగ్ ట్యూన్ తో ఎనర్జిటిక్ గా ఉంది కాబట్టి ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది. ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే పాట ఎలా ఉందో కరెక్ట్ గా చెప్పగలం. ఏదేమైనా ఫుల్ జోష్ లో ఉండే డ్యాన్స్ సాంగ్ అని మాత్రం టీజర్ లో హింట్ ఇచ్చారు.

అల్లు అర్జున్-పూజ హెగ్డే జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్.. నవదీప్.. టబు..జయరామ్.. నివేద పేతురాజ్.. సునీల్ ఇతర కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్.. హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలోపు ఈ ‘రాములో రాములా’ టీజర్ చూసేయండి.
Please Read Disclaimer