రమ్యకృష్ణ స్పీడ్ మామూలుగా లేదుగా?

0

1980లలో రమ్యకృష్ణ సౌత్ లో స్టార్ హీరోయిన్. తెలుగు తమిళంలో ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో.. స్టార్ హీరోల సరసన నటించింది. అప్పటి హీరోయిన్స్ ఇప్పుడు ఆంటీలుగా రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. రమ్యకృష్ణ కూడా సెకండ్ ఇన్నింగ్స్ ను ఎప్పుడో ప్రారంభించింది. రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ‘బాహుబలి’ చిత్రంలో పోషించిన శివగామి పాత్రతో పీక్స్ కు చేరింది. శివగామి పాత్ర మళ్లీ ఆమెకు హీరోయిన్ స్థాయిని కట్టబెట్టింది. అప్పటి నుండి రమ్యకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది.

తెలుగు తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తున్న రమ్యకృష్ణ ప్రస్తుతం సినిమాల ఎంపిక చూస్తుంటే ఆమె స్పీడ్ కు అంతా ఆశ్చర్య పోతున్నారు. ఇటీవలే ఈమె భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ సమయంలోనే రమ్యకృష్ణ మరో సినిమాలో కీ రోల్ కు ఎంపిక అయ్యింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జునతో రమ్యకృష్ణ ఒక చిత్రం చేయబోతుంది.

నాగార్జున ‘బంగార్రాజు’ చిత్రంలో రమ్యకృష్ణ ను ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. బంగార్రాజు చిత్రం విషయం పక్కన పెడితే బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రైడ్’ చిత్రంను నాగార్జున రీమేక్ చేయాలని భావిస్తున్నాడు. అందులో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ ఎంపిక అయ్యిందట. రైడ్ రీమేక్ మేకర్స్ ఇటీవలే రమ్యకృష్ణ ను కలిసి ఆమె డేట్లు తీసుకున్నారట. ఒకప్పుడు నాగార్జునతో పలు సెన్షేషనల్ సినిమాలు చేసిన రమ్యకృష్ణ ఈమద్య కాలంలో సోగ్గాడే చిన్ని నాయన అవంటి సూపర్ హిట్ ను కూడా చేసింది. అందుకే వీరిద్దరి కాంబో మళ్లీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.
Please Read Disclaimer