రమ్యకృష్ణ ఆ పాత్ర లో దుమ్ము లేపారట!

0

పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున ‘రొమాంటిక్’ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరి కథ స్క్రీన్ ప్లే అందించడంతో పాటుగా స్వయంగా నిర్మిస్తున్నారు. బోల్డ్ పోస్టర్లతో.. రొమాంటిక్ సాంగ్ తో ఈ సినిమా ఒక్క సారిగా అందరి దృష్టి ని ఆకర్షించింది.

ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. నిజానికి ఈ పాత్రకు మొదట బాలీవుడ్ లేడీ మందిరా బేడిని ఎంచుకున్నారు. మందిరా లేటు వయసు ఘాటు బికినీ బ్యూటీ అనే సంగతి తెలుసుకదా.. అయితే ఈ సినిమా లో మందిరా పోషించాల్సింది ఆకాష్ కు అమ్మ పాత్ర. దీంతో ఆమె పాత్ర ఎఫెక్టివ్ గా రాలేదట. మందిరా బేడీకి సంబంధించిన రషెస్ చూసినప్పుడు పూరికి పెద్దగా నచ్చలేదట. స్క్రీన్ మీద అందంగా కనిపిస్తున్నప్పటికీ మదర్ క్యారెక్టర్ కు సంబంధించిన ఫీల్ రాలేదని అనిపించిందట. అందుకే ఆ సీన్స్ మొత్తం స్క్రాప్ చేసి ఆ పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకున్నారట.

రమ్యకృష్ణతో ఆ సీన్స్ రెండోసారి చిత్రీకరించాల్సి రావడంతో బడ్జెట్ కూడా పెరిగిందట. అయితే ‘రొమాంటిక్’ టీమ్ రమ్యకృష్ణ పాత్రతో చాలా ఇంప్రెస్ అయ్యారట. రమ్యకృష్ణ అద్భుత నటి అనేది అందరికీ తెలుసు.. ఎటువంటి పాత్ర అయినా ఆవిడ అందులో ఒదిగిపోతారు. పాత్ర కు తగ్గట్టు మారి పోయి వెండి తెరపై మాయ చేస్తారు. ఈ సినిమా విషయంలో కూడా రమ్య అలానే చేశారని.. ‘రొమాంటిక్’ లో ఆమె పాత్ర ఒక హైలైట్ గా ఉంటుందని అంటున్నారు.
Please Read Disclaimer