అమ్మ జయలలిత కొత్త లుక్

0

అమ్మ నిగర్వి. అమ్మ సాత్విక జీవి. అమ్మ పేదల పక్షపాతి. నిరుపేదల పెన్నిధి. అందుకే అశేషంగా అభిమానుల్ని సంపాదించుకుంది జయలలిత అంటూ చెబుతుంటారు. ఆరుసార్లు తమిళనాడును పాలించిన ఏకైక సీఎంగా అమ్మ జయలలిత రికార్డు అసాధారణమైనది. అమ్మ బాల్యం.. టీనేజీలో కథానాయికగా మారి ఎదిగే క్రమం.. అటుపైనా ప్రేమ వ్యవహారం.. అటుపై అగ్ర నాయిక అయ్యి.. కాలక్రమంలో నాయకురాలు అయ్యే క్రమం.. అన్నా డీఎంకే అధినేత్రిగా పాలన సాగించడం.. అటుపై చరమాంకంలో మరణశయ్యపై ఎమోషనల్ ఘట్టం వరకూ జయలలిత జీవితంలో ఎంతో గొప్ప కథ ఉంది. ఆ మొత్తం వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వెబ్ సిరీస్ టైటిల్ క్వీన్. వెటరన్ నటి రమ్యకృష్ణ టైటిల్ పాత్రను పోషిస్తోంది. గౌతమ్ మీనన్ తన శిష్యుడితో కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. అంతటి సీరియర్ డైరెక్టర్ కం టెక్నీషియన్ ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమ్మ కథను ఎంత అద్భుతంగా చూపించబోతున్నారు అన్న ఆసక్తి అటు తంబీల్లోనే కాదు.. ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఉంది. ఇక్కడ రాజకీయ నాయకుల్లో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఇంతకుముందు రమ్యకృష్ణ అమ్మ గెటప్ లో ఎలా కనిపిస్తారు? అన్నది ఎలివేట్ చేస్తూ పోస్టర్లు రిలీజయ్యాయి. వాటికి చక్కని స్పందన వచ్చింది. తాజాగా మరో కొత్త గెటప్ రివీలైంది. ఈసారి తెల్ల ఖద్దరు చీరలో అమ్మ గెటప్ ని రివీల్ చేశారు. ఆల్ ఇండియా అన్నాడీఎంకే అధినేత్రిగా అమ్మ రూపానికి సింబాలిక్ గా ఉంది ఈ రూపం. పార్టీ జెండాలోని రంగుల్ని చీర అంచుకు అద్ది కనిపిస్తోంది. ఒద్దికగా దండ కట్టుకుని తీక్షణంగా ఏదో ఆలోచిస్తూ చూస్తున్న అమ్మ లుక్ మైమరిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో అమ్మ ఫ్యాన్స్ ని పాత మెమరీస్ లోకి తీసుకెళుతోంది.
Please Read Disclaimer