రానా-రాజ్ తరుణ్ మల్టీస్టారర్

0

యంగ్ హీరో రాజ్ తరుణ్ టాలీవుడ్ లో ఎంత స్పీడ్ గా ఎదిగాడో…అంతే వేగంగా డౌన్ ఫాల్ అవ్వడం ప్రముఖంగా చర్చకొచ్చింది. వరుసగా పరాజయాలు వెంటాడుతున్నాయి. అంధగాడు సహా వరుసగా చేసిన ఐదు సినిమాల్లో ఏదీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇటీవలే ఇద్దరి లోకం ఒకటే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో వచ్చిన అవకాశాల్ని సైతం వదులుకోవడానికి సిద్దపడ్డాడు. సురేష్ ప్రొడక్షన్స్ లో డ్రీమ్ గర్ల్ సినిమా లో నటించాల్సి ఉండగా..అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని ప్రచారమైంది. ప్రధాన కారణం ఏమిటన్నది ఇంకా బయటకు రాలేదు. డ్రీమ్ గర్ల్ స్క్రిప్ట్ పనులు సిద్దం చేసుకుని సెట్స్ కు వెళ్లడానికి రెడీ అవుతోన్న సమయంలో రాజ్ తరుణ్ ఈ ట్విస్ట్ ఇచ్చాడని మాట్లాడుకున్నారు.

ఈ నేపథ్యంలో సురేష్ బాబు సదరు యంగ్ హీరోకి మల్టీస్టారర్ లో నటించే అరుదైన అవకాశాన్ని కల్పించారట. రానా కథానాయకుడిగా బాలీవుడ్ సినిమా `సోనూ కి టిటులీకి స్వీటీ` అనే చిత్రం ఆధారంగా ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ గా దీన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో రానా తో కలిసి ఈ సినిమాలో నటించే అరుదైన అవకాశాన్ని కల్పించారు. నిజంగా ఇది చక్కని అవకాశం. రాజ్ తరుణ్ మార్కెట్ డల్ అయిన నేపథ్యంలో రానాతో తొలి కలసి నటిస్తే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.

రాజ్ తరుణ్ యంగ్ ట్యాలెంటెడ్ నటుల్లో ఒకడిగా ఇప్పటికే గుర్తింపు దక్కించుకున్నాడు. తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అవకాశం వచ్చిన ప్రతీచోట నిరూపించుకునే ప్రయత్నం చేసాడు. మరి ఈ ఛాన్స్ ని యంగ్ హీరో సద్వినియోగం చేసుకుంటాడో లేదో చూడాలి. ఈ చిత్రానికి `అలా ఎలా` దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఈ యంగ్ డైరెక్టర్ తో రానా సినిమా చేయాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. సొంత స్క్రిప్ట్ తో సురేష్ బాబుని మెప్పించని నేపథ్యంలో బాలీవుడ్ స్క్రిప్ట్ ఆధారంగా అనీష్ కథను సిద్ధం చేసి పట్టాలెక్కించబోతున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాని సెట్స్ కు తీసుకెళ్లనున్నారు.
Please Read Disclaimer