బేబీ కోసం బాబాయి – అబ్బాయి

0

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ బేబీ’. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. జులై 5వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓ బేబీ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లోని జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వెంకటేష్ మరియు రానాలు హాజరు కాబోతున్నారు.

ఈ చిత్రాన్ని సునీత తాటి మరియు టీజీ విశ్వప్రసాద్ లతో కలిసి సురేష్ బాబు నిర్మించాడు. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ కి ఈ చిత్రం రీమేక్ అనే విషయం తెల్సిందే. సమంత ఈ చిత్రంలో విభిన్నమైన పాత్రలో కనిపించబోతుంది. సీనియర్ నటి లక్ష్మీ.. రాజేంద్ర ప్రసాద్.. రావు రమేష్ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది.

మజిలీ చిత్రంతో సక్సెస్ జోష్ లో ఉన్న సమంత ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రంలోని సమంత నటన ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. నవ్వించడంతో పాటు ఈ చిత్రం ప్రేక్షకులను ఏడిపించబోతున్నట్లుగా సమంత తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది.
Please Read Disclaimer