చైతును ఫుల్ గా ఆడుకున్న రానా

0

అక్కినేని నాగ చైతన్య తాజా చిత్రం ‘సవ్యసాచి’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చైతు – చందూ మొండేటి గ్యాంగ్ ఇప్పటికే జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా సవ్యసాచి టీమ్ రానా దగ్గుబాటి నిర్వహిస్తున్న సూపర్ హిట్ టాక్ షో ‘నెం. 1 యారీ’ కి అతిథులు గా వచ్చారు. చైతు.. చందూ మొండేటితో పాటుగా హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది.

రానా- చైతులు ఇద్దరు రిలెటివ్స్ మాత్రమే కాదు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అసలే రానాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ.. దీంతో చెలరేగిపోయి మరీ చైతూని అటపట్టించాడు. ఇంకా ఈ ఎపిసోడ్ టీవీలో ప్రసారం కాలేదుగానీ దీనికి సంబంధించిన ప్రోమో వీడియో ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా రానా షేర్ చేశాడు. ఈ ప్రోమోలో చైతు అసలేమాత్రం ఊహించని ప్రశ్నలు వేసి చైతును షాక్ అయ్యేలా చేశాడు. “ఖంగారుగా పెళ్ళిచేసుకున్నావని ఎప్పుడైనా అనిపించిందా?” అని రానా అడగగా.. “ఇదెక్కడి దారుణంరా బాబూ.. మొన్ననే ఫస్ట్ యానివర్సరీ కూడా అయింది” అని నవ్వుతూ అన్నాడు.

ఇక చందూ మొండేటి ని “చైతన్య అమ్మాయిల్లో ఎక్కువగా ఏం గమనిస్తాడు?” రానా అడిగితే చందూ “దాని గురించి ఎందుకులే!” అంటూ తెలివిగా తప్పించుకున్నాడు. ఇక ఆగకుండా “సమంత నుంచి ఒక రోజులో చైతూకి ఎన్నిసార్లు ఫోన్ వస్తుంది?” అని అడిగాడు. దీనికి సమాధానంగా “రెండు మూడుసార్లు కంగారుగా పక్కకు వెళతారు.. అంటే అది సమంత నుంచి ఫోన్ రావడం వల్లనే ఏమో!”అంటూ మరోసారి చలాకీ సమాధానం ఇచ్చాడు. హీరోయిన్ నిధిపై కూడా గట్టిగా జోకులు పేల్చినట్టున్నారు. ఈ ఎపిసోడ్ ఆదివారం నాడు ప్రసారం అవుతుందట.
Please Read Disclaimer