బాలీవుడ్ భామతో రానా.. చిల్ అవుట్!

0

టాలీవుడ్లో రెండు టాపిక్ లపై నిరంతరం చర్చ జరుగుతూ ఉంటుంది. అందులో ఒకటి ప్రభాస్ పెళ్లి.. రెండోది రానా ఆరోగ్యం. ఎన్నిసార్లు వారిద్దరూ తమపై వచ్చే వార్తలను పుకార్లని తీసిపారేసినా ఆ టాపిక్ లు మాత్రం ఎవర్ గ్రీన్. రానా ఆరోగ్యం విషయమే తీసుకుంటే ఈ రూమర్లకు విసిగిపోయానని.. ఆ వార్త తనకు బోర్ కొడుతోందని “ఉప్మా కాకుండా వేరే ఏదైనా ట్రై చెయ్’ అన్నట్టుగా కొద్దిరోజుల క్రితం స్పందించాడు.

రానా ప్రస్తుతం అమెరికా ట్రిప్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అనారోగ్యకరమైన పుకార్లు కృష్ణా నదివరదలా వస్తూనే ఉన్నాయి. అభిమానులు కూడా కొందరు టెన్షన్ తో ‘#వుయ్ వాంట్ రానా లేటెస్ట్ పిక్’ ఒక హ్యాష్ టాగ్ ను ఈమధ్య ట్రెండ్ చేశారు. ఆ డిమాండ్ కు స్పందించిన రానా తన లేటెస్ట్ పిక్ ఒకటి పోస్ట్ చేసి వారిని శాంతపరిచాడు. ఇదిలా ఉంటే తాజాగా రానా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న మరో ఫోటోకూడా బయటకు వచ్చింది. రానాకు ఫ్రెండ్స్ ఎక్కువనే సంగతి తెలిసిందే. రీసెంట్ గా బెవర్లీ హిల్స్ లో ఉండే ఒక కామన్ ఫ్రెండ్ రానాను.. బాలీవుడ్ భామ హుమా ఖురేషిని భోజనానికి ఆహ్వానించారట. దీంతో ఇద్దరూ కలిసి అక్కడ భోజనం చేశారట. ఆ సమయంలో తీసిన ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ ఫోటోలో రానాను చూస్తుంటే ఫిట్టుగా ఉన్నాడని అనిపిస్తోంది కదా. రానా.. హుమా ఇద్దరి నవ్వులు చూసుంటే ఫుల్ గా చిల్ ఆవుట్ అయ్యారని అనిపిస్తోంది. ఇది రానా అభిమానులకు గుడ్ న్యూసే కానీ పుకార్ల మారాజులకు మాత్రం ఇలాంటివి పట్టవు కదా. మరో వారంలో కొత్తరకం అనారోగ్యపు వార్తతో ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టడానికి రెడీ అవుతారు.
Please Read Disclaimer