రానా ప్లాన్స్ మాములుగా లేవు!

0

బాహుబలిలో భల్లాలదేవాగా విశ్వరూపం చూపించిన రానా నేనే రాజు నేనే మంత్రి తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలం తెరమీద కనిపించలేదు. చేతి నిండా సినిమాలతో ఊపిరాడనంత షెడ్యూల్స్ ఉన్నా అవి పూర్తి కావడంలో జాప్యం జరుగుతూనే ఉంది. ఇకపై రానా సినిమాలు వరసగా పలకరించబోతున్నాయి. త్వరలో విరాట పర్వం సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు రానా. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్. కానీ రానా చేస్తున్న మూవీస్ అన్నింటిలోకి గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందబోయే హిరణ్యకశిప మీదే అందరి దృష్టి ఉంది.

వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మాణం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా కీలక పాత్ర పోషించనున్నాయి. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ఏ సౌత్ సినిమా గ్రాఫిక్స్ మాయాజాలం చేయలేకపోయింది. ఇది దృష్టిలో పెట్టుకునే రానా రాజీ పడకుండా హాలీవుడ్ టాప్ గ్రాఫిక్స్ కంపెనీలను లైన్లో పెడుతున్నాడు. అందులో ఒకటి డిజిటల్ డొమైన్. ఈ సంస్థ అవెంజర్స్ ఆక్వా మ్యాన్ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ లాంటి సూపర్ మూవీస్ కి పని చేసింది.

ఇంకొకటి టెక్నీ కలర్. ఇటీవలే ప్రపంచాన్ని ఊపేసిన ది లయన్ కింగ్ ఎఫెక్ట్స్ చేసింది వీళ్ళే. ఇప్పుడు హిరణ్యకశిప కోసం ఈ రెండు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. తెలుగు తెరపై ఇదివరకు కనిపించని రీతిలో నభూతో నభవిష్యత్ అనిపించాలంటే ఇలాంటి వాళ్లే కావాలి. బడ్జెట్ ఎలాగూ నో కాంప్రోమైజ్ అనే తరహాలో పెట్టుకున్నారు కాబట్టి ఒకవేళ డీల్ ఓకే అయితే టాలీవుడ్ లో మరో అద్భుతం జరగబోతున్నట్టే. ఇది రానా స్వయంగా వెల్లడించాడు కాబట్టి కార్యరూపం దాల్చడం సాధ్యమే
Please Read Disclaimer