రానా విరాటపర్వం ఇంకా ఎంతకాలం?

0

రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో సురేష్ బాబు ఇంకా సుధాకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అయ్యింది. మద్యలో రానా అనారోగ్యం కారణంగా బ్రేక్ వేశారు. సినిమా కాన్సెప్ట్ చాలా విభిన్నంగా ఉండటంతో పాటు సాయి పల్లవి చిత్రంలో హీరోయిన్ అవ్వడం వల్ల సినిమాకు మొదటి నుండి బజ్ ఉంది. కాని ఆ బజ్ కు తగ్గట్లుగా స్పీడ్ గా చిత్రీకరణ చేయలేక పోయారు. కారణం ఏదైనా షూటింగ్ ఆలస్యం అయ్యింది.

ఎట్టకేలకు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ చేశారట. ఆ యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్స్ మాస్టర్స్ మరియు టెక్నీషియన్స్ ను రంగంలోకి దించినట్లుగా సమాచారం అందుతోంది. ఉరి సినిమాకు స్టంట్స్ మాస్టర్ గా చేసిన స్టీఫెన్ రిచెర్ ను ఈ సినిమా కోసం హాలీవుడ్ నుండి రప్పించినట్లుగా సమాచారం అందుతోంది. దాదాపుగా రెండు వారాల పాటు అత్యంత రిస్కీ ఫైట్స్ ను చిత్రీకరించడంతో యాక్షన్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యిందని తెలుస్తోంది.

ఇక చిత్రీకరణ చివరి షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణ చేయనున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ షెడ్యూల్ ను వచ్చే నెలలో పూర్తి చేసి సమ్మర్ చివరి వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని రానా అండ్ టీం భావిస్తున్నారట.

ఇక రానా అరణ్య చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదలైన కొన్ని వారాల్లోనే విరాట పర్వం కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. రానా ఈమద్య గ్యాప్ కాస్త ఎక్కువ తీసుకున్నాడు. ఆ గ్యాప్ ను ఫిల్ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నాడట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-