రెండు గుర్రాల స్వారీపై రానా!!

0

హీరోగా సేఫ్ గా కమర్షియల్ సినిమాలు చేసుకుంటున్నంత కాలం ఏ రిస్క్ ఉండదు. ఒకటి రెండు పోయినా మిగిలినవి ఆడితే చాలు కెరీర్ లో సెటిల్ అయిపోవచ్చు. రానా ఈ కోణంలో ఆలోచించలేదు కాబట్టే సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నా హీరో సమానంగా వెయిటేజ్ తెచ్చుకుంటున్నాడు. బాహుబలిలో విలన్ గా మెప్పించాక ఘాజీలో హీరోగా నేనే రాజు నేనే మంత్రిలో నెగటివ్ షేడ్స్ ఉన్న టైటిల్ రోల్ లో దేనికదే సంబంధం లేకుండా మెప్పిస్తున్నాడు. ఇదే పంథాను కొనసాగించేలా రానా తరువాతి సినిమాలు ఉండటం విశేషం.

ఎన్టీఆర్ లో చంద్రబాబు నాయుడుగా రానా లుక్ గురించి ఇప్పటికే మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. దీని కోసం బరువు తగ్గి బాగా సన్నబడిన రానాను చూసి అందరు షాక్ తిన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కీలక షూటింగ్ పూర్తి చేసుకున్న రానా ఓ ఛానల్ కోసం చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో నెంబర్ వన్ యారి సీజన్ 2 ని మళ్ళి స్టార్ట్ చేయబోతున్నాడు. ఈసారి ఫార్మాట్ ని మార్చి కొత్తగా రూపొందిస్తున్నట్టు ఇప్పటికే ప్రోమోల ద్వారా ఫుల్ పబ్లిసిటీ చేస్తున్నారు.

అవి కాకుండా రానా మరో చారిత్రాత్మక చిత్రం మార్తాండ వర్మ :ది కింగ్ అఫ్ ట్రావెన్కోర్ లో నటిస్తున్నాడు. తమిళ తెలుగులో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ మూవీ షూటింగ్ కొంత భాగం ఇప్పటికే పూర్తయ్యింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించిన మొట్టమొదటి రాజుగా మార్తాండ వర్మకు జనానికి తెలిసింది తక్కువని ఇందులో అద్భుతంగా చిత్రీకరించడం జరిగిందని ఊరిస్తున్నాడు. మరోవైపు మావటిగా డిఫరెంట్ రోల్ చేస్తున్న హాతి మేరా సాతి కూడా రానా చేతిలో ఉంది. వీటిలో ముందు వచ్చేది ఎన్టీఆర్ అయినప్పటికీ మిగిలిన రెండూ కూడా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో వచ్చేస్తాయి. మొత్తానికి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా దూసుకుపోతున్న రానా ఇవి పూర్తయ్యాక చేయాల్సిన ప్రాజెక్ట్స్ గురించి కథా చర్చల్లో ఉన్నట్టు సమాచారం. తేజతో ఓ సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ కమిట్మెంట్స్ కారణం ఆ అది వాయిదా పడినట్టు సమాచారం.
Please Read Disclaimer