హీరోనే ఫైనల్ కాలేదంటే హీరోయిన్లా?

0

ఒకప్పుడు ప్రేమ కథలను కొత్త కోణంలో ఆవిష్కరించిన దర్శకుడు తేజ. కొత్త హీరో హీరోయిన్లను వెతికి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ట్యాలెంట్ ఆయనది. యూత్ లోకి లవ్ ట్రెండ్ ఎక్కించిన ఘనుడు కూడా ఆయన. అయితే నిజం సినిమాలో మహేష్ బాబుతో అవినీతిపై యుద్ధం చేయించి బుక్కయ్యాడు. ఔటాఫ్ ది బాక్స్ కాన్సెప్టు అవ్వడంతో ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు. అనంతరం వరుస ఫ్లాపులతో డీలా పడిపోయిన ఈ దర్శకుడు చాలాగాలం గ్యాప్ తీసుకున్నాడు. అటుపై రాజకీయ నేపథ్యంలో కథను సిద్ధం చేసుకున్న తేజ ..దగ్గుబాటి రానాతో కలిసి నేనే రాజు నేనే మంత్రి చిత్రం తీసి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారు. అయితే బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ అన్న టాక్ అతడికి మైనస్ అయ్యింది. అనంతరం మళ్లీ సీత తీసినా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక తేజ పని అయిపోయిందిలే అనుకుంటున్న వేళ తన పుట్టిన రోజున రెండు సినిమాలు తీస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపాడు.

సినిమాలు ప్రకటించడంతోపాటు టైటిల్స్ సైతం ప్రకటించేయడం తేజ స్పెషల్. ఇందులో ఒకటి రానాతో.. మరొకటి గోపీ చంద్ తో తీస్తాడన్న ప్రచారం సాగుతోంది వీటిలో రానాతో రాక్షస రాజ్యంలో రావణాసురుడు చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రచారం జోరుగా సాగుతోంది. గోపీచంద్ తో అలివేలు మంగమ్మ చిత్రాన్ని చేస్తారని టాక్. అయితే తాజాగా ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే రానాతో తీయబోయే చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారట. పొలిటికల్ జానర్ లో తెరకెక్కించే ఈ చిత్రంలో ముగ్గురు భామల కోసం తేజ గాలిస్తున్నారట. ఇప్పటికే ఇటు టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లో కొందరు హీరోయిన్లతో ఈ దర్శకుడు సంప్రదింపులు జరిపారని.. ఇంకా ఎవరినీ ఫైనలైజ్ చేయలేదని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు ఈ దర్శకుడు యంగ్ హీరో రానాని కమిట్ చేయించేశారా? అంటే ఇంకా సందేహం వ్యక్తమవుతంది. ఇప్పటివరకూ రానా నుంచి కాల్షీట్లు తీసుకున్నారా ? ఇంత బీజీ షెడ్యూల్స్ నడుమ తేజకు రానా ఒప్పుకున్నారా ? అనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మరి తేజ మాత్రం ఈ చిత్రం కోసం ముగ్గురు భామలను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించడం మరీ తొందరపాటేమోమని సోషల్ మీడియా వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-