ఆ మలయాళ రీమేక్ లో రానా నటిస్తున్నాడా…?

0

‘అయ్యప్పనుమ్ కోసియుమ్’ మలయాళ మూవీ రీమేక్ రైట్స్ హారిక హాసిని – సితార ఎంటర్టైన్మెంట్స్ వారి దగ్గర ఉన్నాయి. ఈ సినిమా మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించినప్పటి నుండి ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని అన్ని భాషల వాళ్ళు ట్రై చేస్తున్నారు. మన టాలీవుడ్ లో కూడా ఈ చిత్రానికి సంభందించి రోజుకొక వార్త పుట్టుకొచ్చింది. ఇందులో ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి దాకా విక్టరీ వెంకటేష్ – రవితేజలతో రీమేక్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిన్న బాలయ్య – ఎన్టీఆర్ కలిసి చేస్తున్నారంటూ మరో వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా బాలయ్య – మంజు విష్ణు నటిస్తున్నట్లు మరో వార్త పుట్టుకొచ్చింది. ఇందులో యువ హీరో పాత్ర కోసం మంచు విష్ణుని అనుకుంటున్నట్టు సమాచారమంటూ మరో న్యూస్ వచ్చింది. కానీ ఈ వార్త వాస్తవం కాదని అసలు మంచు విష్ణు ని సంప్రదించలేదని సమాచారం. ఇప్పుడు తాజాగా ఇంకో యువ హీరో తెర మీదకి వచ్చాడు.

ఇప్పుడు ఈ చిత్ర రీమేక్ వార్తల్లోకి దగ్గుబాటి రానా వచ్చి చేరాడు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ పోషించిన పాత్ర కోసం రానాని సంప్రదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కోషియమ్ క్యారెక్టర్ కు రానాను తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్ర చేయడానికి రానా కూడా ఆల్మోస్ట్ అంగీకరించాడంట. రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంట. ఇంక మరో ప్రధాన పాత్ర ‘అయ్యప్పనుమ్’ కోసం వెతుకులాట స్టార్ట్ చేసారంట. కరోనా ప్రభావ పరిస్థితులు సమిసిపోతే వచ్చే నెలలో ఈ చిత్రానికి సంబంధించి ఆఫిసిఅల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-