ఆ పనిమీద అమెరికా వచ్చాను: రానా దగ్గుబాటి

0

ప్యాన్ ఇండియా రికగ్నిషన్ ఉన్న టాలీవుడ్ హీరోలలో రానా ఒకరు. ఎంత పాపులారిటీ ఉంటే ఆ సెలబ్రిటీపై మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ అంత ఎక్కువ గా ఫోకస్ ఉంటుంది కదా. అలానే రీసెంట్ గా రానా పలు రకాల వార్తలు మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. రానా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని.. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కోసం అమెరికాకు వెళ్ళినట్టుగా కథనాలు జోరుగా వచ్చాయి.

అయితే తాజాగా ఈ కథనాలపై రానా స్వయంగా స్పందించాడు. “నేను నా కొత్త సినిమా కోసం రీసెర్చ్ చేసేందుకు.. వీఎఫ్ ఎక్స్ కంపెనీల వారిని కలిసి చర్చలు జరిపేందుకు అమెరికా వచ్చాను. కొన్నివారాల పాటు ఇక్కడే ఉంటాను. టెక్నికలర్ ప్రీ ప్రొడక్షన్ లాబ్ ను సందర్శించి అక్కడ హిరణ్యకశ్యప సినిమా విజువల్ ఎఫెక్ట్స్ గురించి చర్చించాల్సి ఉంది” అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ వార్తలకు రానా పూర్తిగా చెక్ పెట్టినట్టే.

రానా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తెలుగులో ‘విరాట పర్వం’.. బాలీవుడ్ లో ‘హాథీ మేరె సాథి’.. ‘హౌస్ ఫుల్ 4’ చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా మరో రెండు మూడు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home