మ్యాచో మ్యాన్ హెల్త్ పై ఫ్యాన్స్ ఆసక్తి

0

దగ్గుబాటి రానా కటౌట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హైట్… అందుకు తగ్గ వెయిట్ తో చక్కని శరీర సౌష్టవాన్ని కలిగిన మ్యాచో హీరో. మెలి తిగిన కండలు రానాకి స్పెషల్ లుక్ ని తీసుకొస్తాయి. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో రానా ఒకరు. ఆరడుగుల 1 ఇంచి ఎత్తు ఉన్న హీరోగా రానా ఇండియన్ టాలెస్ట్ హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు. మరి ఇప్పుడు రానా ఎలా ఉన్నారో చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.

ప్రస్తుతం రానా కొత్త ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రానా బక్కచిక్కి కనిపిస్తున్నాడు. రూపం పూర్తిగా మారిపోయింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు రెండింతలు బరువు తగ్గినట్లుగా కనిపిస్తున్నాడు. మరి రానా ఆరోగ్యం పరిస్థితి ఏమిటి అంటే .. గత కొన్ని నెలలుగా రానా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనిలో భాగంగా ట్రీట్ మెంట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రానా వేగంగానే కోలుకుంటున్నారని తెలుస్తోంది.

డాక్టర్ల సూచన మేరకు డైట్ పాటిస్తున్న రానా కొన్ని రకాల ఆహార పదార్థాలకే పరిమితమవ్వడంతో బాగా వెయిట్ తగ్గినట్లు తెలుస్తోంది. కారణాలు ఏవైనా రానా త్వరగా కోలుకోవాలి. ఆ పాత రూపాన్ని తిరిగి తీసుకురావాలి. రానా మునుపటిలా మ్యాచో మ్యాన్ గానే మారాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రానా పలు తెలుగు.. హిందీ సినిమాల్లో నటిస్తున్నాడు. పలువురు నవతరం దర్శకహీరోల్ని ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు.