‘వై ఆర్ యూ?’ అంటున్న దగ్గుబాటి రానా…!

0

దగ్గుబాటి రానా వైవిధ్యమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రామానాయుడు స్టూడియో మరియు రామానాయుడు ఫిల్మ్ స్కూల్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారనే విషయం తెలిసిందే. డిజిటల్ రంగంలో టెక్నాలజీలో వస్తున్న మార్పులకు తగ్గట్టు.. తమ స్కూల్ ఫిల్మ్ మేకింగ్ లో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నాడు. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా.. 24 క్రాఫ్ట్స్ పై అవగాహన కలిగి ఉండి సినిమా నిర్మాణంలో కూడా భాగం పంచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో మరో విన్నూతమైన ఆలోచనతో వస్తున్నాడు రానా. ”వై ఆర్ యూ?” అనే యానిమేటెడ్ సిరీస్ తో త్వరలో మీ ముందుకు రాబోతున్నానని ప్రకటించాడు. దీనికి రానా హోస్ట్ గా ఉండటంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇది రియలిష్ వ్యక్తులతో ఉండే ఫిక్షనల్ యానిమేటెడ్ కామెడీ సిరీస్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన టీజర్ ని రానా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసాడు.

ఇదిలా ఉండగా రానా ప్రస్తుతం ‘అరణ్య’ ‘విరాటపర్వం’ అనే సినిమాల్లో నటించాడు. పాన్ ఇండియా మూవీగా తెలుగు తమిళ హిందీ భాషల్లో రూపొందించిన ‘అరణ్య’ చిత్రానికి నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రభు సాలోమన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగులో ‘అరణ్య’.. తమిళంలో ‘కాదన్’.. హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మానవులు – జంతువుల మధ్య అనుబంధాన్ని ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో ఈ సినిమా తెరకెక్కించారు. రానా అడవిలో నివసించే మావటి వాడిగా.. జంతు ప్రేమికుడు ఆదివాసి ‘బన్ దేవ్’ పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి ‘లైఫ్ ఆఫ్ పై’ ‘థోర్’ ‘బై మోక్ష్ బక్షి’ వంటి చిత్రాలకు వి.ఎఫ్.ఎక్స్ అందించిన ప్రాణ స్టూడియో వర్క్ చేసింది. ‘త్రీ ఇడియట్స్’ ‘పీకే’ ‘పింక్’ చిత్రాలకు సంగీతాన్ని అందించిన శాంతను మోయిత్ర ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఆస్కార్ అవార్డ్ విజేత రసూల్ పూకుట్టి ఈ చిత్రానికి సౌండ్ మిక్సింగ్ చేసారు. ఇక ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా నటించిన ‘విరాటపర్వం’ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని సమాచారం.