రానా మరో వీ.ఎఫ్.ఎక్స్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్

0

రానా వరుసగా ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ఇప్పటికే అరణ్య (హాథీ మేరా సాథీ).. హిరణ్య కశిప లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న అతడు `విరాట పర్వం` చిత్రాన్ని ఆల్మోస్ట్ పూర్తి చేశాడు. విరాట పర్వం ఈపాటికే రిలీజ్ కావాల్సినది. కానీ కోవిడ్ వల్ల ఆలస్యమైంది. అరణ్య .. హిరణ్య కశిప భారీ పాన్ ఇండియా చిత్రాలు.. వాటికి ఇంకా వీ.ఎఫ్.ఎక్స్ సహా పెండింగ్ పనులు చాలా చేయాల్సి ఉంది.

తాజాగా మరో దర్శకుడికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. `గృహం` ఫేం మిలింద్ రౌ దర్శకత్వంలో కొత్త చిత్రానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబుతో కలిసి గోపీనాథ్ ఆచంట నిర్మించనున్నారు. మిలింద్ ఇప్పటికే రానాకు కథను వివరించాడు. బాగా నచ్చింది. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో సినిమా ఇది. ఇందులో వీ.ఎఫ్ఎక్స్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని సమాచారం.

తాజా ఎంపిక కూడా యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశమేనని అర్థమవుతోంది. వీఎఫ్.ఎక్స్ బేస్డ్ కథాంశాన్ని ఎంపిక చేసుకున్నారు రానా. అతడు నటిస్తున్న అరణ్య.. హిరణ్యకశిప చిత్రాలకు వీఎఫ్.ఎక్స్ పనితనం కాస్త ఎక్కువే అవసరం పడిన సంగతి తెలిసిందే.