రానా అప్పుడే పెళ్లి కొడుకు అయ్యాడే

0

నిన్న సాయంత్రం రానా మిహీకా బజాజ్ ల వివాహ నిశ్చితార్థం జరుగబోతుంది అంటూ తెగ ప్రచారం జరిగింది. అయితే ఆ విషయాన్ని సురేష్ బాబు కొట్టి పారేశాడు. రానా నిశ్చితార్థం కాదు నేడు ఇరు కుటుంబాలు కలిసి కూర్చుని మాట్లాడుకోబోతున్నాం. నిశ్చితార్థం పెళ్లి విషయంలో త్వరలో క్లారిటీ ఇస్తామంటూ సురేష్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నిశ్చితార్థం పెళ్లి ఎలా చేయాలనే విషయాన్ని మాట్లాడబోతున్నట్లుగా చెప్పాడు.

సురేష్ బాబు ప్రకటనతో రానా నిశ్చితార్థ విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలు రానా నిశ్చితార్థం అయ్యిందా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. మాట్లాడుకోవడంకు కూడా ఇంత హడావుడి చేశారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రానా మిహికా బజాజ్ ల ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రానాకు అప్పుడే పెళ్లి కళ వచ్చేసిందే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

రానా తెల్లటి షర్ట్ వేసుకుని తెల్లటి దోతి కట్టుకోవడంతో పాటు మిహీకా బజాజ్ పట్టు చీరలో మెరిసింది. వీరిద్దరు కొత్త పెళ్లి జంటలా మెరిసి పోతున్నారు. వీరి పెళ్లి కోసం దగ్గుబాటి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే వీరి పెళ్లి డేట్ ను కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home