వివాహ వేదికను సిద్ధం చేసిన దగ్గుబాటి ఫ్యామిలీ…?

0

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ఎట్టకేలకు తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన బంటీ – సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె అయిన మిహీకా బజాజ్ ను ప్రేమించిన రానా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. వీరి పెళ్ళికి ఇరు కుటుంబాలు కూడా ఓకే చెప్పేశారు. ఈ క్రమంలో ఇటీవల దగ్గుబాటి రానా – మిహీకా బజాజ్ ల రెండు కుటుంబాల వారు కలిసి రోకా వేడుకను కూడా నిర్వహించారు. ఈ రోకా వేడుకలో రానా – మిహిక బజాజ్ నిశ్చితార్థం.. వివాహం ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 8న హైదరాబాద్ లో రానా – మిహీకల పెళ్లి జరగనుంది. పెళ్లి వాయిదా వేసుకున్నారని వచ్చిన వార్తలను ఖండించిన దగ్గుబాటి ఫ్యామిలీ ఆగస్ట్ 8న వివాహ వేడుక జరుగుతుందని స్పష్టం చేసింది.

కాగా రానా – మిహీకా ల పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయట. తాజా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో వైభవంగా నిర్వహించబోతున్నారట. స్వయానా ఇంటీరియర్ డిజైనర్ అయిన మిహికా బజాజ్ ఇప్పటికీ పెద్ద పెద్ద వివాహ వేడుకలకు వెడ్డింగ్ ప్లానర్ గా వ్యవహరించారు. దీంతో వీరి వెడ్డింగ్ కి కూడా రాయల్ థీమ్ తో సన్నాహాలను చేస్తోందట. తెలంగాణ ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్ ని అనుసరించి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని వివాహం జరిపించాలని కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారట.
Please Read Disclaimer