ఆర్య 2 షూటింగ్ లో రానాకు ఉన్న రహస్య మెమోరీస్ ఏంటో?

0

అల్లు అర్జున్ ‘ఆర్య 2’ చిత్రం విడుదలై 10 సంత్సరాలైంది. ఈ సందర్బంగా అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విషయం తెల్సిందే. అల్లు అర్జున్ సినిమా షూటింగ్ సమయంలో చాలా మధుర జ్ఞాపకాలు ఉన్నాయంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు చాలా రెస్పాన్స్ వచ్చింది. పలువురు ప్రముఖుల నుండి మెగా ఫ్యాన్స్ వరకు స్పందించారు. సుకుమార్ దర్శకత్వంలో ఆ సినిమాను చేయడంను జీవితాంతం మర్చిపోలేను అంటూ ఆర్య ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.

ఆర్య 2 మెమోరీస్ గురించి బన్నీ పోస్ట్ చేయగా ఆ సినిమాలో కీలక పాత్రలో నటించిన నవదీస్ స్పందిస్తూ ‘అమెజింగ్ మెమోరీస్’ అంటూ పోస్ట్ చేశాడు. అయితే ఈ సినిమాకు ఏమాత్రం సబంధం లేని రానా బన్నీ పోస్ట్ పై స్పందించాడు. నాకు కూడా ఆ సెట్స్ లో చాలా చాలా మెమోరీస్ ఉన్నాయంటూ కామెంట్ చేశాడు. రానా కామెంట్ కు సమాధానంగా బన్నీ ఈమోజీలు పోస్ట్ చేశాడు. మూడు స్మైల్ ఈమోజీలు పోస్ట్ చేయడంతో పాటు ఒక సైలెన్స్ అన్నట్లుగా పోస్ట్ చేశాడు. అలాంటివి చెప్పొద్దు అన్నట్లుగా బన్నీ సైలెంట్ ఈమోజీని పోస్ట్ చేయడం జరిగింది.

ఇంతకు రానాకు ఆర్య 2 సెట్స్ లో ఉన్న మర్చి పోలేని జ్ఞాపకాలు ఏంటో.. వాటిని బన్నీ చెప్పవద్దంటూ ఎందుకు నవ్వుతున్నాడు అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ సెట్స్ లో రానా ఏదైనా చిలిపి పని చేసి ఉంటాడా. అందుకే బన్నీ వాటిని చెప్పవద్దని అంటున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి వీరిద్దరి మద్య చర్చ ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. రానాకు ఉన్న రహస్య మెమోరీస్ ఏంటా అంటూ ఆయన్ను మరియు బన్నీని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
Please Read Disclaimer