స్టూడియో వల్ల కాదు ట్యాలెంట్ వల్లే ఇక్కడున్నా

0

సోషల్ మీడియాలో సెలబ్రెటీ దృష్టిని ఆకర్షించేందుకు కొందరు కొన్ని కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తు ఉంటారు. కొందరు సెలబ్రెటీలను విమర్శించడం వల్ల తమ పోస్ట్ లకు స్పందించేలా చేయాలని అనుకుంటారు. మరికొందరు వారిపై ప్రశంసలు కురిపించడం ద్వారా వారు తమ పోస్ట్ లకు స్పందించాలని భావిస్తారు. కొందరు సెలబ్రెటీలు ఎలాంటి కామెంట్స్ చేసినా.. ఎలాంటి పోస్ట్ లు పెట్టినా స్పందించరు. కాని రానా మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనపై వచ్చే ప్రతి కామెంట్ కు మరియు ప్రతి పోస్ట్ ను చూస్తూ కొన్నింటికి స్పందిస్తూ ఉంటాడు.

రానా కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పదవ తరగతి ఫెయిల్ అయినా కూడా పట్టుదలతో అనుకున్నది నెరవేర్చుకోగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ వీడియోను పోస్ట్ చేసి రానాను ఉద్దేశించి స్టూడియోలు వెనుక ఉంటే పదవ తరగతి ఫెయిల్ అయినా కూడా అనుకున్నది సాధించవచ్చు అంటూ కామెంట్ చేశాడు. స్టూడియోల వల్లే నీవు ఈ స్థాయిలో ఉన్నావు.. నీ వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ వల్లే ప్రస్తుత నీకు ఈ గౌరవం అంటూ ఆ వ్యక్తి పోస్ట్ పెట్టాడు.

అతడి పోస్ట్ కు రానా కాస్త ఘాటుగా స్పందించాడు. స్టూడియోలు ఉన్నంత మాత్రాన ఎంట్రీ దక్కుతుందేమో తప్ప గుర్తింపు రాదు. నాకు ప్రస్తుతం వచ్చిన గుర్తింపు అనేది నా ట్యాలెంట్ తో దక్కించుకున్నాను.. నా వెనుక స్టూడియోలు ఉండటం వల్ల కాదంటూ రానా చెప్పుకొచ్చాడు. రానా స్పందనకు నెటిజన్స్ మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయన్ను మద్దతుగా కామెంట్స్ చేస్తే మరికొందరు ఇప్పుడు ఎన్ని మాటలైనా చెప్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు.