#వుయ్ వాంట్ లేటెస్ట్ రానా పిక్.. ఇలా!

0

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటికి దేశవ్యాప్తంగా ఉండే ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ప్రభాస్ లాగా రానా పెద్ద స్టార్ కాదు కానీ ‘బాహుబలి’ చిత్రంతో భారీగా గుర్తింపు సాధించాడు. ఇక ‘ఘాజి’ లాంటి సినిమాలతో సోలో హీరోగా కూడా అందరినీ మెప్పించాడు. అయితే ఈమధ్య రానా ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. రానా అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. చికిత్స కోసమే అమెరికాకు వెళ్ళాడని గాసిప్స్ గుప్పుమన్నాయి. రానా ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. దీంతో ఆందోళన చెందిన రానా అభిమానులు కొందరు ‘#వుయ్ వాంట్ లేటెస్ట్ రానా పిక్’ అంటూ సోషల్ మీడియాలో ఒక హ్యాష్ టాగ్ ట్రెండ్ చేశారు.

ఈ విషయం రానా దృష్టికి పోవడంతో స్పందిస్తూ ఒక ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. “నా గురించి అడుగుతూ ఉన్న అందరికీ.. ఇదిగోండి నా ఫోటో.. లాస్ ఏంజెలెస్ నుంచి” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫోటోలో రానా గుబురు గడ్డంతో.. కూలింగ్ గ్లాసెస్ ధరించి స్మైల్ ఇస్తూ పోజిచ్చాడు. రానా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న అభిమానులకు ఇది రిలీఫ్ అనుకోవచ్చు.

‘హిరణ్యకశ్యప’ చిత్రం ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా వీఎఫ్ఎక్స్ పనుల కోసమే అమెరికా టూర్ కు వెళ్ళడం జరిగిందని రానా గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. అమెరికా టూర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ‘విరాట పర్వం’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం.
Please Read Disclaimer