వెంకీమామ రిలీజ్ సస్పెన్స్ వీడిందిలా!

0

ఇటీవలి కాలంలో గూగుల్ లో ట్రెండింగ్ అయిన హాట్ టాపిక్ `వెంకీమామ` రిలీజ్ తేదీ.. అసలు ఈ సినిమా రిలీజవుతుందా.. అవ్వదా? అగ్ర నిర్మాత కం ఎగ్జిబిటర్ సురేష్ బాబులోనే ఎందుకింత కన్ఫ్యూజన్? అంటూ మాట్లాడుకున్నారు పరిశ్రమలో. వెంకీ మామ రిలీజ్ కన్ఫ్యూజన్ వల్ల ఎన్నో చిన్న సినిమాలు తేదీలు ఫిక్స్ చేసుకోలేక తంటాలు పడ్డాయట.

అక్టోబర్ అంటూ ఓసారి.. సంక్రాంతి అంటూ ఇంకోసారి.. డిసెంబర్ అంటూ మరోసారి రకరకాలుగా కన్ఫ్యూజ్ చేసేశారు. దీనిపై వెంకీ – చైతూ ఫ్యాన్స్ లోనూ అసహనం నెలకొంది. ఇంత జరిగినా రిలీజ్ తేదీ మాత్రం ఫిక్స్ చేయలేదు. అధికారికంగా పోస్టర్ ని వేయలేదు. దీంతో ఈ సస్పెన్స్ కి తెర దించాలని సురేష్ బాబు బృందం చాలానే కసరత్తులు చేసింది. పోటీ నిర్మాతలతో ముచ్చటించి .. అలాగే దేశ విదేశాల్లోని పంపిణీ వర్గాలతో ముచ్చటించి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చేశారు.

డిసెంబర్ 13న వెంకీమామ రిలీజ్ ని అధికారికంగా కన్ఫామ్ చేస్తూ తాజాగా యంగ్ హీరో రానా ఓ వీడియోని రిలీజ్ చేశారు. అనంతరం రిలీజ్ పోస్టర్ ని కూడా చిత్రబృందం రివీల్ చేసింది. ఇక రానాతో రూపొందించిన వీడియో చాలా క్రియేటివ్ గా ఆకట్టుకుంది. అసలు రిలీజ్ తేదీ ఎపుడో చెప్పకపోవడంతో తనకు జిమ్ లో కూడా ప్రశాంతత కరువైంది. వరుసగా మెసేజ్ లు షంటేశాయి. అయితే అదే అసహనంలో జిమ్ నుంచి రామానాయుడు ప్రివ్యూ థియేటర్ కి వెళ్లిన రానా అక్కడ అప్పటికే సినిమా ఫైనల్ కాపీ చూస్తున్న దర్శకుడు బాబీని ప్రశ్నించాడు. రిలీజ్ ఎప్పుడు బ్రో అంటూ అసహనం కనబరిచాడు. మొత్తానికి జనాల్లో ఉన్న అసంతృప్తిని రానా రూపంలో తెలివిగానే చూపించారు. వెంకటేష్ – నాగచైతన్య కథానాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 13న రిలీజ్ ఫిక్స్ చేసేశారు కాబట్టి ఫ్యాన్స్ కి సస్పెన్స్ తొలగిపోయినట్టే. డిసెంబర్ 12న వెంకీమామ ప్రీమియర్లకు ఏర్పాట్లు చేయనున్నారన్నమాట.
Please Read Disclaimer