హీరో- నిర్మాత గొడవలో నలిగిపోతున్న డైరెక్టర్

0

1945 మూవీ నిర్మాత రాజరాజన్ తో హీరో రానా విభేధాల గురించి తెలిసిందే. సినిమా పూర్తయింది. రిలీజ్ చేస్తున్నాం అంటూ దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో రానా ఖంగు తిన్నాడు. పూర్తి కాని సినిమాని రిలీజ్ చేస్తారా? ఫస్ట్ లుక్ ప్రకటన చూసి షాకయ్యాను. నేను ఏడాది కాలంగా ఎవరినీ కలవలేదు. పారితోషికాలు పూర్తిగా చెల్లించలేదు. చాలా వరకూ సినిమా పెండింగులో ఉంది. నా పాత్రను చిత్రీకరించాల్సినది చాలా ఉంది… అంటూ రానా బయటపడ్డాడు.

ఒకవేళ సినిమా పూర్తి కాకుండానే అడ్డగోలుగా రిలీజ్ చేయాలని భావిస్తే గనుక నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని హెచ్చరించారు రానా. అతడు చెబుతున్న దానిని బట్టి సినిమా ఇంకా పూర్తవ్వలేదనే భావించాల్సి వస్తోంది. అయితే మరోవైపు దర్శకుడు సత్య శివ వెర్షన్ వేరొకలా ఉంది. ఆయన మీడియాతో ముచ్చటించిన దానిని బట్టి వెర్షన్ పూర్తి ఆపోజిట్ గా కనిపిస్తోంది.

“సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఔట్ పుట్ విషయంలో నేను హ్యాపీగా ఉన్నాను. కంటెంట్ బాగా వచ్చింది. రానా ఇప్పటికే తమిళ వెర్షన్ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. అయితే నిర్మాతతో రానాకు ఏవో అపార్థాలు వచ్చాయి. వాటిని పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాను“ అని తెలిపాడు. శాటిలైట్ రైట్స్ ఇప్పటికే అమ్ముడు పోయాయి కాబట్టి ఇద్దరి మధ్యా అపార్థాలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలి అని అన్నాడు. అయితే దర్శకుడు ఒకలా.. రానా ఏమో ఇంకోలా అనడం రకరకాల కన్ఫ్యూజన్ లకు తావిస్తోంది. “మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్“ అనకుండా మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్యేనా? అన్నది తేలాల్సి ఉంది.
Please Read Disclaimer