రానాను అలా వాడేసుకున్న విశాల్

0

తమిళ స్టార్ హీరో విశాల్ అతి త్వరలో ‘యాక్షన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంపై తమిళంలోనే కాకుండా తెలుగు నాట కూడా ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల నడుమ రూపొందిన యాక్షన్ సినిమా ప్రమోషన్స్ ను చాలా విభిన్నంగా చేసేందుకు విశాల్ ప్రయత్నిస్తున్నాడు. సినిమా పబ్లిసిటీ కోసం ఒక ర్యాప్ సాంగ్ ను పెడుతున్నాడు. తమిళం మరియు తెలుగు వర్షన్ లలో ఇద్దరు స్టార్ హీరోలు వేరు వేరుగా పాడినట్లుగా తెలుస్తోంది.

తెలుగులో ఈ ర్యాప్ సాంగ్ ను రానాతో పాడించినట్లుగా విశాల్ వెళ్లడించాడు. రానాకు ఫోన్ చేసి ఒక హెల్ప్ కావాలంటూ అడిగిన వెంటనే ఆడియో విడుదల కార్యక్రమానికి రావాలా అన్నాడు. లేదు పాట పాడాలంటే ఆశ్చర్య పోయి నేను తెలుగు మాట్లాడటమే కష్టం. అలాంటిది పాట ఎలా అన్నాడు. అయినా కూడా నా కోసం పాట పాడాడు. పాట చాలా బాగా వచ్చిందని.. ప్రస్తుతం ఎడిటింగ్ జరుగుతుందని తప్పకుండా ఈ పాట సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుందనే నమ్మకంను విశాల్ వ్యక్తం చేశాడు.

తమిళ వర్షన్ కు గాను ఈ ర్యాప్ పాటను ఆది పినిశెట్టితో పాడినట్లుగా తెలుస్తోంది. ప్రమోషన్ కోసం ఈ ర్యాప్ ను అతి త్వరలో విడుదల చేయబోతున్నారట. ఈమద్య కాలంలో ప్రమోషన్ సాంగ్స్ చాలా కామన్ అయ్యాయి. అందుకే ఈ పాటను యాక్షన్ కోసం హీరోలతో పాడించినట్లుగా తెలుస్తోంది. విశాల్ అభిమానులు ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి రేటుకు అమ్ముడు పోయినట్లుగా తమిళ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి. ఈ నెలలో యాక్షన్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Please Read Disclaimer