రానా మకాం మారుస్తున్నాడంటూ

0

యంగ్ హీరో రానాపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పుకార్ల సిరీస్ లోనే మరో పుకార్ వేడెక్కిస్తోంది. రానా తొందర్లోనే హైదరాబాద్ ని వీడుతున్నారని.. తన మకాంను ఇక నుంచి ముంబైకి షిఫ్ట్ చేసుకునే ఆలోచనలో వున్నారని ప్రచారం సాగుతోంది. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రానా ఇటీవలే అమెరికాలో చికిత్స పొందారని ప్రచారమైంది. చికిత్స అనంతరం బయటికొచ్చిన రానా ఫొటో ఒకటి ఆ వార్తలకు బలాన్ని చేకూర్చింది. రానా మారిన రూపం అభిమానుల్ని విస్మయానికి గురిచేసింది. బాగా బరువు తగ్గిన రానా కొత్త రూపం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. రానా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రానాని చూసిన నెటిజన్స్ ఏమైంది బ్రో.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రానా ఆ తర్వాత మీడియా ముఖంగా క్లారిటీనిచ్చారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఈ మాట చెప్పి అలసిపోయానని అన్నారు.

ఆ తర్వాత కూడా రానాపై రూమర్లు ఆగడం లేదు. గత నాలుగు నెలలుగా అమెరికాలో వుంటున్న రానా త్వరలోనే ఇండియా తిరిగి రాబోతున్నాడని.. అయితే వచ్చాక హైదరాబాద్ నుంచి తన మకాంను ముంబైకి షిప్ట్ చేసే అలోచనలో వున్నాడని ప్రచారమవుతోంది. ముంబైలో ఇప్పటికే ఓ సేఫ్ ప్లేస్ సిద్ధమైంది. పలువురు కుటుంబ సభ్యులు అక్కడ తనతో ఉంటారు. తన మేనత్త.. నాగచైతన్య తల్లిగారు అయిన లక్ష్మి రానాతో పాటు ఉండి సపర్యలు చేస్తారని ప్రచారం సాగుతోంది.

మరోవైపు ఇన్ని రకాల పుకార్ల నడుమ రానా సినిమాలపైనా దృష్టి సారించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గుణశేఖర్ తో చేయబోతున్న `హిరణ్యకశ్యప` వీఎఫ్ ఎక్స్ వర్క్.. ప్రీప్రొడక్షన్ వర్క్ అమెరికాలో జరుగుతోంది. దీని కోసమే రానా అమెరికాలో వుంటున్నాడనేది మరో వాదన వినిపిస్తోంది. ఇందులో ఏది నిజం అన్నది దగ్గుబాటి ఫ్యామిలీ పెదవి విప్పి చెప్పాల్సి ఉంది. అయితే ఇలా తామరతంపరగా వస్తున్న వార్తలకు చెక్ పెట్టేయకపోవడం వల్లనే ఇలా ప్రచారం సాగుతోందా? అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి అన్ని రకాల కన్ఫ్యూజన్స్ కి చెక్ పెట్టేలా.. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వివరణ రావాల్సి ఉంది. ఇప్పటికే రానా మాత్రం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ప్రకటించారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home