రానాకు ఇంకాస్త సమయం కావాలట

0

రానా అనారోగ్య కారణాల వల్ల గత కొన్నాళ్లుగా షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ప్రారంభం అయిన ‘విరాటపర్వం’ చిత్రం షూటింగ్ లో రానా పాల్గొనాల్సి ఉంది. కాని ఆయన అమెరికా వెళ్లడంతో ఆ సినిమా ఆయన లేకుండానే చిత్రీకరణ జరుపుకుంది. సాయి పల్లవితో పాటు ముఖ్య తారాగణంకు సంబంధించిన సీన్స్ ను దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించాడు.

రానా అమెరికా నుండి ఇటీవల ఇండియా తిరిగి వచ్చాడు. దాంతో మళ్లీ నిన్న సోమవారం నుండి విరాటపర్వం చిత్రంలో రానా నటించనున్నాడు.. కొంత గ్యాప్ తర్వాత రానా కెమెరా ముందుకు రాబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది. కాని విరాటపర్వం షూట్ లో రానా నిన్నటి నుండి పాల్గొనడం లేదని.. అవన్ని పుకార్లే అంటు చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. రానా మరో నెల రోజుల విశ్రాంతి తర్వాత విరాటపర్వం చిత్రం షూటింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

రానా కంటి ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్లి వచ్చాడట. ఇంకాస్త విశ్రాంతి తీసుకున్న తర్వాత షూటింగ్ లో రానా పాల్గొంటే బాగుంటుందని డాక్టర్లు సూచించడంతో మరి కొన్నాళ్లు ఆగి షూటింగ్ లో పాల్గొనాలనే నిర్ణయానికి రానా వచ్చారంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రానా విరాటపర్వం చిత్రమే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా నటించేందుకు ఓకే చెప్పాడు. వచ్చే ఏడాదిలో రానా బిజీ బిజీగా నటించనున్నాడని.. ఈ ఏడాదికి ఇక రానా సినిమాలు ఏమీ రాకపోవచ్చు అంటూ ఆయన సన్నిహితులు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు.
Please Read Disclaimer