రణరంగం ఈవెంట్ ఆ ఊరిలో..

0

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రణరంగం’. ఈ సినిమాను ఆగష్టు 15 న రిలీజ్ చేసేందుకు నిర్మాతలైన సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ప్రమోషన్స్ ప్రారంభించారు. టీజర్.. ట్రైలర్లతో పాటుగా లిరికల్ సాంగ్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెరిగేలా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి కూడా ప్లేసు ఫిక్స్ అయిందట. మెజారిటీ సినిమా ఈవెంట్లు హైదరాబాద్ లోనే జరుగుతాయి కానీ ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లోనే పలు నగరాల్లో ఈవెంట్లు నిర్వహించడం ఒక ట్రెండ్ గా మారింది. ఆ ట్రెండ్ కు కొనసాగింపు అన్నట్టుగా ‘రణరంగం’ ఈవెంటును కాకినాడలో ప్లాన్ చేశారట. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ‘రణరంగం’ లో కొన్ని ఇంపార్టెంట్ ఎపిసోడ్ల చిత్రీకరణ కాకినాడలోనే జరిగింది. అంతే కాకుండా ఈ నెలాఖరు నుండి ఓ రెండు వారాల పాటు బన్నీ – త్రివిక్రమ్ చిత్రం షూటింగ్ కాకినాడలోనే ప్లాన్ చేశారట. రణరంగం నిర్మాతలు సితార ఎంటర్టైన్మెంట్స్.. బన్నీ సినిమా నిర్మాతలు హారిక హాసిని అధినేతలు ఒకరే కాబట్టి.. కాకినాడలో ఆగష్టు 4 న ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేసుకున్నారట. అయితే కాకినాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపినా హైదరాబాద్ లో మరో ఈవెంట్ జరుపుతారట.

గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ప్రశాంత్ పిళ్ళై.
Please Read Disclaimer