చిరంజీవిపై రాంచరణ్ ఎమోషనల్ పోస్ట్

0

నాన్నంటే.. నడిపించే నాయకుడే కాదు.. జీవితానికి దిక్సూచీ. చిరంజీవి అంటే సొంతంగా ఎన్నో కష్టాలు పడి టాలీవుడ్ లో నంబర్ 1 స్థితికి చేరుకున్నారు. ఆయన పరిచిన బాటలోనే కదా.. ఇప్పుడు మెగా హీరోలంతా పుట్టుకొచ్చింది. అందుకే చిరంజీవిని మెగా ఫ్యామిలీనే కాదు.. అందరూ ఎంతో గౌరవంగా చూస్తారు..

తనకు జీవితాన్ని ఇవ్వడమే కాదు.. ఇండస్ట్రీలో నిల బెట్టిన చిరంజీవి ని ఫాదర్స్ డే సందర్భంగా రాంచరణ్ గుర్తుచేసుకున్నాడు. ఏమిచ్చినా నాన్న రుణం తీర్చుకోలేనని.. ‘కొన్ని బంధాలను ఏ రకంగా వర్ణించలేం.. మాటలు చాలవు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.

ట్విట్టర్ లో తండ్రితో కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటోలు.. ఇప్పటి ఫొటోను షేర్ చేసిన రాంచరణ్ ఈ సందర్భం గా తన తండ్రి ప్రేమను దేనితోనూ కొలవలేం అన్నట్టుగా భావోద్వేగ పోస్టు ను పంచుకున్నాడు. ఫాదర్స్ డే సందర్భం గా చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Please Read Disclaimer