స్టార్స్ తో నిండి పోతున్న ‘రంగమార్తాండ’

0

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ వరుస ఫ్లాప్ ల కారణంగా కొంత గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీ మూవీ నట సామ్రాట్ కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. మరాఠీ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతో కృష్ణవంశీ పూర్వ వైభవం సాధించడం ఖాయం అంటూ ఆయన అభిమానులు మరియు ఆయన సన్నిహితులు చాలా నమ్మకంగా ఉన్నారు.

ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ మరియు ప్రకాష్ రాజ్ లు నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా పలువురు స్టార్స్ కూడా ఈ చిత్రం లో కనిపించబోతున్నారు. బ్రహ్మానందం.. అనసూయ.. రాహుల్ సిప్లిగంజ్ లు నటించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. కొన్ని రోజుల క్రితం అవికా గౌర్ ఒక కీలక పాత్రను ఈ చిత్రంలో చేయ బోతున్నట్లు గా ప్రచారం జరిగింది. అమితాబ్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు అన్నారు. ఇప్పుడు మరో స్టార్ ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెల్సిందే. సినిమా ఫ్లాప్ అయినా నటిగా మాత్రం శివాత్మికకు మంచి గుర్తింపు వచ్చింది. కమర్షియల్ హీరోయిన్ అయ్యే లక్షణాలు శివాత్మికలో ఉన్నాయంటూ విశ్లేషకులు అన్నారు. ఇప్పుడు శివాత్మిక తన రెండవ సినిమాను ‘రంగమార్తాండ’గా చేయబోతుంది. ఒక కీలకమైన పాత్రకు గాను కృష్ణవంశీ ఈమెను ఎంపిక చేశాడని.. వచ్చే నెలలో శివాత్మిక ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. రంగమార్తాండ సినిమా రంగం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అందకు తగ్గట్లుగానే ఈ సినిమాను స్టార్స్ తో దర్శకుడు నింపేస్తున్నాడు.
Please Read Disclaimer