రంగస్థలంపై అవార్డుల వర్షం

0

నిన్న అంగరంగ వైభవంగా జరిగిన సైమా అవార్డుల వేడుకలో రంగస్థలం పురస్కారాల పంట పండించుకుంది. ఇటీవలే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో రామ్ చరణ్ కు గుర్తింపు రాలేదని బాధ పడిన మెగా ఫ్యాన్స్ కు ఊరట కలిగేలా ఇందులో మాత్రం కీలక విభాగాలన్నీ తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ నటుడు (రామ్ చరణ్) – ఉత్తమ నటి క్రిటిక్స్ (సమంతా) – ఉత్తమ దర్శకుడు (సుకుమార్ ) ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ (అనసూయ) – ఉత్తమా సంగీత దర్శకుడు (దేవిశ్రీ ప్రసాద్) – ఉత్తమ ఛాయాగ్రహణం (రత్నవేలు) – ఉత్తమ గీత రచయిత (చంద్రబోస్) – ఉత్తమ గాయని (మానస) – ఉత్తమ కళా దర్శకుడు (రామకృష్ణ) ఇలా మొత్తం 9 అవార్డులు తన ఖాతాలో వేసుకుని జెండా గట్టిగా ఎగరేసింది.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న కారణంగా రామ్ చరణ్ అటెండ్ కాలేకపోవడంతో తన స్థానంలో చిరంజీవి అందుకోవడం విశేషం. ఇప్పటికే ఈ సైమా అవార్డుల ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. రంగస్థలంకు ఇంత భారీగా గుర్తింపు దక్కడం పట్ల అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గత ఏడాది మార్చ్ లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన రంగస్థలం రికార్డులు ఇప్పటికీ చాలా కేంద్రాల్లో పదిలంగా ఉన్నాయి.

మళ్ళీ సైరాతోనే అవి బ్రేక్ అవుతాయని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రామ్ చరణ్ ని చెవిటివాడిగా రివెంజ్ డ్రామాలో సుకుమార్ ఆవిష్కరించిన తీరు ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. కన్నడలో గత నెల డబ్బింగ్ రూపంలో విడుదలై అక్కడా మంచి విజయం సొంతం చేసుకున్న రంగస్థలం లాంటి మెమరబుల్ హిట్స్ టాలీవుడ్ కు ఏడాదికి నాలుగైదు రావాలని మూవీ లవర్స్ కోరుతున్నారు. అదే జరిగితే అంతకన్నా కావాల్సింది ఏముంది.




Please Read Disclaimer