ముఖ్య మంత్రితో చరణ్ పోరాటం..

0రంగస్థలం చిత్రం తో మెగా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో యాక్షన్ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కాకపోతే ఆ షెడ్యూల్ లో చరణ్ పాల్గొనలేదు. ఈ నెల రెండో వారం నుండి రెండో షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్నాడు.

అయితే ఈ మూవీ కి సంబదించిన ఓ వార్త బయటకు వచ్చి చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఓ ముఖ్య మంత్రికి – ఓ యువకుడి కి మధ్య సాగుతుందట. అంటే ఓ పొలిటికల్ కథ అని సమాచారం. ఈ సినిమా బీహార్ నేఫథ్యంలో సాగుతుందట. బీహార్ ముఖ్యమంత్రితో హీరో పోరాటం చేస్తాడన్న మాట. ముఖ్యమంత్రిగా మహేష్ మంజ్రేకర్ నటిస్తుండగా , మరో విలన్ గా వివేక్ ఓబరాయ్ నటిస్తున్నాడు.