అక్కచెల్లిల ఓవర్ యాక్షన్ ఎక్కువ అయ్యింది!

0

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ అనే విషయం తెల్సిందే. కంగనా తన దుడుకు స్వభావం వల్ల ఇండస్ట్రీలో పలువురిని శత్రువులుగా మార్చుకుంది. స్టార్ కిడ్స్ అంటూ ఎంతో మంది స్టార్స్ పై గతంలో విమర్శలు చేసింది కంగనా. ఇక సినిమాల మేకింగ్ విషయం లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అంటూ కంగనాపై విమర్శలు వస్తూ ఉంటాయి. కంగనా మాత్రమే కాకుండా ఆమె సోదరి రంగోలీ కూడా బాలీవుడ్ స్టార్స్ పై ఎప్పటికప్పుడు నోరు పారేసుకుంటూ వస్తోంది.

కొన్ని రోజుల క్రితం ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్బంగా కరణ్ జోహార్.. ఆలియా భట్ తో పాటు పలువురిపై విమర్శలు గుప్పించిన రంగోలీ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఏకంగా బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్స్ కు ఛాలెంజ్ విసిరింది. తన సోదరి గొప్ప మిగిలిన హీరోయిన్స్ అంతా కూడా తన తర్వాతే అన్నట్లుగా ఆమె భావిస్తూ ఈ ఛాలెంజ్ ను చేసింది. ప్రస్తుతం రంగోలీ ఛాలెంజ్ పై బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

ఇంతకు రంగోలీ ట్విట్టర్ లో చేసిన ఛాలెంజ్ ఏంటీ అంటే… ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో కంగనా తప్ప ఎవరైనా 60 నుండి 100 కోట్ల బడ్జెట్ తో లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని చేయగలరా. ఆ సత్తా ఏ హీరోయిన్ కు అయినా ఉందా. ఆ స్థాయిలో బడ్జెట్ ను కంగనాపై కాకుండా మరెవ్వరిపైన అయినా పెట్టే సత్తా ఉందా. ఒక వేళ అలా చేస్తే కంగనా సినీ కెరీర్ ను వదులుకుంటుంది. లేదంటే నా పేరును నేను మార్చుకుంటాను అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసింది.

ఈమద్య కాలంలో పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు వస్తున్నాయి. ఆ సినిమాలు మంచి వసూళ్లనే దక్కించుకుంటున్నాయి. సమయం సందర్బం వచ్చినప్పుడు ఖచ్చితంగా భారీ బడ్జెట్ తో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు వస్తాయి. అంతే కాని ఇలా రెచ్చి పోయి ఛాలెంజ్ లు చేసి పరువు పోగొట్టుకోవద్దంటూ నెటిజన్స్ హితవు పలుతుకుతున్నారు. అక్కా చెల్లెల్ల ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువ అవుతుందంటూ మరికొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-