కంగనా సిస్టర్స్ కు ఇప్పటికైనా కనువిప్పయ్యేనా?

0

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇటీవల ‘పంగా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం విడుదలైన మొదటి రోజే సినీ విమర్శకులు మరియు నెటిజన్స్ సినిమా నిరాశ పర్చిందంటూ తేల్చి చెప్పారు. ముఖ్యంగా రివ్యూలు బ్యాడ్ గా వచ్చాయి. పంగా చిత్రంపై బ్యాడ్ రివ్యూలు రాసిన రివ్యూవర్స్ పై కంగనా సిస్టర్ రంగోలీ తీవ్ర స్థాయి లో విమర్శలు గుప్పించింది. చెత్త సినిమాలకు మంచి రివ్యూలు ఇచ్చే మీలాంటి వారి రివ్యూలకు విలువ లేదు.. మీ రివ్యూల వల్ల సినిమా ఫలితం ఏమీ మారదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

కంగనా కూడా రివ్యూల పై అసంతృప్తి వ్యక్తం చేసింది. సోషల్ మీడియా లో చాలా మంది పంగా సినిమా డిజాస్టర్ అంటూ ప్రచారం చేయడంపై కూడా రంగోలీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారిపై కూడా విరుచుకు పడిరది. సినిమా హిట్ అంటూ రంగోలీ చాలా చెప్పేందుకు ప్రయత్నించింది. కాని వచ్చిన కలెక్షన్స్ తో సినిమా ఫలితం ఏంటో తేలి పోయింది. కనీసం పాతిక కోట్లు కూడా పంగా రాబట్టలేక పోవడంతో ఈమద్య కాలంలో కంగనా కు అత్యంద దారుణమైన ఫలితంగా పంగా నిలిచింది.

ఇప్పటికైనా రివ్యూవర్స్ పై వ్యాఖ్యలు చేయడం మానేసి.. సినిమాకు వచ్చిన టాక్ను స్వాగతించి తదుపరి చిత్రాల విషయం లో తప్పులు జరుగకుండా చూసుకుంటే మంచిదంటూ నెటిజన్స్ కంగనా సిస్టర్స్ కు సలహా ఇస్తున్నారు. పంగా చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ కంగనా సిస్టర్స్ కు కనువిప్పును కలిగించాయంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కంగనా తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ తలైవి లో నటిస్తున్న విషయం తెల్సిందే.
Please Read Disclaimer