పిచ్చిదాన్ని లోనెయ్యండి అన్నాడు..రంగోలి ఏమందంటే?

0

అక్క చెల్లెళ్లు కంగన- రంగోలి కాంబినేషన్ జోలికి వెళ్లాలంటే పురుష ప్రపంచం గజగజ ఒణుకుతున్న సంగతి తెలిసిందే. శివంగి సిస్టర్స్ గా ఆ ఇద్దరి ఇమేజ్ అలాంటిది. పురుషాధిక్య ప్రపంచాన్ని ధిక్కరించడానికి ఏమాత్రం జంకని ఎరోటిక్ సిస్టర్స్ గానూ మేల్ ప్రపంచం భావిస్తుంటుంది. అయితే ఇదంతా తెలిసీ తాజాగా ఓ నెటిజన్ నోరు జారి అడ్డంగా ఇరుక్కుపోయాడు. అది కూడా మొసలి నోటికి చిక్కినట్టు కంగన సోదరి రంగోలికి అడ్డంగా చిక్కాడు.

అసలింతకీ అతడు ఏమని కామెంట్ చేశాడు? అంటే.. మొన్న రిలీజైన కంగన `తలైవి` (నాయకురాలు) గెటప్ చూశాక.. మతి చెడిందట. దీంతో అతడు ఆ లుక్ పైనా కంగన యాటిట్యూడ్ పైనా ఎంతో వ్యంగ్యంగా స్పందించాడు. “కంగన గురించి నేను చాలా విన్నాను. ఈ పిచ్చిదాన్ని దయచేసి రూమ్ లో వేసి లాక్ చేస్తారా ఎవరైనా. ఆ నోటి నుంచి తిట్ల పురాణం ఆపగలమా.. వాటీజ్ దిస్ రబ్బిష్“ అని కామెంట్ చేశాడు.

తలైవి జయలలిత పాత్ర కోసం ఫ్యాట్ గా మారేందుకు కంగన ఎంతగానో ప్రయత్నించిందని టీజర్ చెబుతోంది. ప్రోస్థటిక్స్ లో ప్రయత్నించినా .. హార్మోన్ మెడిసిన్ ని ఉపయోగించిందట. దానివల్ల మెడ కింద.. నడుము కింద.. కొవ్వు పెరిగేందుకు ఆస్కారం ఉంది. జయలలిత నాయకురాలిగా ఉన్నప్పుడు ఫ్యాట్ గా కనిపించారు. ఆ లుక్ కోసం కంగన చాలానే సాహసం చేసిందట. అయితే సదరు నెటిజన్ కంగన ను మ్యాడ్ ఉమెన్ అని… తిట్లతో అట్రాసిటీ చేస్తుందని వ్యాఖ్యానించడంతో రంగోలి అతడి నోరు మూయించే రీట్వీట్లతో చెలరేగింది.

ఈస్ట్రోజన్ ట్యాబ్లెట్ల వల్ల నటీనటులు కొన్ని నిర్ధేశించిన భాగాల్లో బొద్దెక్కవచ్చు.. అంటూ వివరణ ఇచ్చిన రంగోలి.. కంగన ఇదంతా చేసేది ఎందుకంటే తన పాత్రలోకి పరకాయం చేసేందుకేనని చెప్పింది. గొప్ప నటులు.. గొప్ప స్థాయికి చేరేందుకు ఎంతకైనా తెగిస్తారు. కంగన ఫేవరెట్ స్టార్ డేనియల్ డే లూయీస్ కి పక్కటెముకలు విరిగాయి. అతడు నటనకోసం.. ఎంచుకున్న పాత్రకోసం.. రిస్క్ చేశాడు. కంగన కూడా అంతే“ అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది.
Please Read Disclaimer