రాణీ వారు.. ఇదో రకం తిక్క వేషం

0

తిక్కలో ఎన్ని రకాలు? బుర్ర తిరిగే తిక్క.. బులపాటం తిక్క.. బరితెగించే తిక్క.. బలిసిన తిక్క.. ఇలా తిక్కను రకరకాలుగా వర్ణించవచ్చు. నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది! అంటూ గురూ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ని స్ఫురణకు తెచ్చుకుందో ఏమో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న రాణీ వారు ఆ తిక్కను కాస్తా జనాల నెత్తిన రుద్దేస్తున్నారా? అనిపిస్తోంది.

కాన్సెప్టు బావుంది. రాజా వారు రాణీ వారిని సంకెళ్లతో బంధించి ఎత్తుకెళుతున్నారు. తనని ఎత్తుకెళుతున్నారా .. తీసుకెళుతున్నారా? అన్నది అటుంచితే.. పద్మావత్ ని వాంచించిన ఖిల్జీ గారా? ఆయనేమైనా అంటే అబ్బెబ్బే అన్నట్టుగా ఉంది. పోనీ.. ఆయనేమైనా గజినీనా? అంటే అలా ఏం కనిపించడం లేదు. స్త్రీలను ముట్టుకుంటే ఘోరం జరుగుతుంది అన్నట్టే ఉందీ రాజా వారి వాలకం.

మొత్తానికి కాన్సెప్ట్ ఫోటోతో సోనమ్ కపూర్ వేసిన వేషం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. ముస్లిమ్ రాణిగా కనిపిస్తోంది కాబట్టి మొఘల్ సామ్రాజ్యపు రాణి అనుకోవచ్చేమో. తనని బంధించినది హిందూ రాజునా? అన్నది తనే చెప్పాలి. మెహబూబా రాణి వారికి రీప్లెస్ మెంటులా కనిపిస్తున్న సోనమ్ ట్రీట్ పై ఫ్యాన్స్ ఫీలింగ్ ఇది. రవివర్మకే పోటీకొచ్చేలా ఈ ఛాయాచిత్రాన్ని పెయింట్ చేసి ఎవరైనా కానుకిచ్చారా తనకు?
Please Read Disclaimer