80ల్లో కూడా మెహబూబా.. పాటకు చిందేసిన సీనియర్ యాక్టర్!

0

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ రంజిత్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. బాలీవుడ్లో దాదాపు 200పైగా చిత్రాల్లో నటించారు. గోపాల్ బేడీ అనేది ఆయన అసలు పేరు. కానీ సినిమాల్లోకి వచ్చాక రంజిత్ అని మార్చుకున్నారు. ప్రస్తుతం అయన వయసు 80కి దగ్గర పడుతోంది. ఈ వయసులో కూడా ఆయన ఎంతో హుషారుగా ఉన్నారు. తాజాగా రంజిత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. రంజీత్ తన కూతురితో కలిసి బాలీవుడ్ క్లాసిక్ షోలే సినిమాలోని మెహబూబా.. మెహబూబా పాటకు చిందులేశారు. ప్రస్తుతం ఈ తండ్రి కూతురి డాన్స్ చేసిన వీడియో నెటిజన్లని తెగ ఆకట్టుకుంటోంది. ‘నా వయసు 80కి దగ్గర పడుతోంది.. నేను ఇలా డాన్స్ చేస్తున్నానంటే అందుకు కారణం కేవలం నా కుమార్తె మాత్రమే.. నన్ను నా కూతురు మాత్రమే డాన్స్ చేయించగలదు” అని రంజిత్ ఇంస్టాగా పోస్ట్ లో పేర్కొన్నారు.

తండ్రి కూతుళ్ళ డాన్స్ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈ వీడియోకు బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ఫిదా అయ్యారు. అమేజింగ్ అంకుల్ అని కామెంట్ పెట్టాడు. నటుడు రంజిత్ అలనాటి బాలీవుడ్ చిత్రాల్లో తిరుగులేని విలన్. 197080వ దశకంలో రంజీత్ అనేక బాలీవుడ్ సినిమాల్లో ఒక వెలుగు వెలిగారు. ఎక్కువ సినిమాల్లో విలన్గా నటించి అత్యంత పాపులర్ విలన్గా పేరు సంపాదించారు రంజిత్. అమర్ అక్బర్ ఆంథోని ముకద్దర్ కా సికందర్ సుహగ్ ది బర్నింగ్ ట్రైన్ లావారిస్ రాఖీ కిషన్ కన్హయ్య హల్చల్ ధరమ్ వీర్ సినిమాలో తనదైన విలనిజాన్ని పండించారు.ఆయన డైలాగ్ డెలివరీ అభిమానులని బాగా ఆకట్టుకుంటుంది. రంజిత్ చివరగా అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 4 సినిమాలో నటించారు. ప్రస్తుతం నెట్టింట తండ్రి కూతుళ్ళ హవా బాగా నడుస్తుంది.

 

View this post on Instagram

 

Nearing 80 yrs, only my daughter can make me dance (on her fingers)

A post shared by Ranjeet (@ranjeetthegoli) on
Please Read Disclaimer