స్టార్ కపుల్ 70 కోట్లతో డ్రీమ్ హౌస్

0

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ వీర్ సింగ్ మరియు దీపిక పదుకునేలు ఈనెల 14 – 15వ తారీకుల్లో వివాహం చేసుకోబోతున్న విషయం తెల్సిందే. చాలా సంవత్సరాలుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లి గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు వీరి వివాహంకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం ఇద్దరి కుటుంబాల్లో పెళ్లి వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం దీపిక తన సొంత నగరమైన బెంగళూరులో ఉండగా రణ్వీర్ సింగ్ ముంబయిలో ఉన్నాడు. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి ఉండేందుకు ఒక డ్రీమ్ హౌస్ ను నిర్మించుకుంటున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

షారుఖ్ ఖాన్ 70 కోట్లతో భారీ బంగ్లాను నిర్మించుకోవడం జరిగింది. ప్రస్తుతం అదే తరహాలో స్టార్ కపుల్ దీపిక – రణ్ వీర్ లు కూడా దాదాపు 70 కోట్లతో డ్రీమ్ హౌస్ ను కట్టించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ముంబయిలోని అత్యంత ఖరీదైన ఏరియాలో ఈ హౌస్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభం అయ్యిందట. బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను కలిగి ఉన్న వీరు 70 కోట్లతో ఇు్ల అనేది పెద్ద విషయం కాదని సినీ వర్గాల వారు అంటున్నారు.

రణ్ వీర్ సింగ్ మరియు దీపిక పదుకునేల పెళ్లి హంగామా అప్పుడే బాలీవుడ్ లో కనిపిస్తూనే ఉంది. బాలీవుడ్ సినీ తారలతో పాటు రాజకీయ ప్రముఖులు మరియు బిజినెస్ మెన్స్ వీరి వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దం అవుతున్నారు. సంగీత్ కార్యక్రమంలో స్టార్స్ హంగామా పెద్ద ఎత్తున ఉండబోతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Please Read Disclaimer