రాజీ.. తల్వార్ తరువాత చపాక్: రణవీర్

0

దీపికా పదుకొణే నటించిన చపాక్ ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపిక నటించడమే గాక నిర్మాతగా పెట్టుబడులు పెట్టింది. ఇలాంటి సినిమాలు అందరికీ చేరువవ్వాలన్న పంతంతో దీపిక పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీనిలో భాగంగా యాసిడ్ బాధితులను వ్యక్తిగతంగా కలిసి… వాళ్ల ఎమోషన్ ని పట్టుకునే ప్రయత్నం చేసింది. బాలీవుడ్ సెలబ్రిటీలకు…సామాజిక వేత్తలకు ప్రత్యేకంగా ప్రీమియర్ షోని వేసారు.

ఈసందర్భంగా షో పూర్తయిన అనంతరం దీపిక భర్త .. నటుడు రణవీర్ సింగ్ భావోద్వేగానికి గురయ్యాడు. అలాగే భార్య నటనను.. దర్శకురాలు మేఘన గుల్జార్ పనితనాన్ని ప్రశంసించాడు. మేఘనను ఉద్దేశించి మీ చిత్రం ప్రేక్షకుల్లో…జీవితంపై ఆశను..ధైర్యాన్ని నింపుతున్నాడు. మంచి చెడు మధ్య రంగులు మారే మనిషి వ్యవహారాన్ని చక్కగా చూపించారు. యాసిడ్ బాధితుల ఎమోషన్ ని ఎంతో గొప్పగా చూపించారు. రాజీ.. తల్వార్ ల తరువాత చపాక్ ఉంటుంది. ఈ సినిమా మిమ్మల్ని గొప్ప దర్శకురాలిగా నిలబెడుతుందని మేఘనను పొగిడేశారు.

ఇక దీపిక గురించి మాట్లాడుతూ… మై బేబి ఈసినిమా కోసం ఎంత కష్టపడ్డావో చెప్పడానికి నేనే సాక్ష్యం. దీపిక ప్రతి రోజు అలసిపోని ఇంజిన్ లా పనిచేసింది. ఈ సినిమాకు నువ్వు ఆత్మలా నిలిచావు. నీ కెరీర్ లో ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. నా అంచానాల్ని మించి నటించి…నా మనసుని కదిలించావు. ఆ పాత్రకు ఓ గౌరవాన్ని తీసుకొచ్చావని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. దీపికకు అందిన తొలి ప్రశంస భర్త నుంచే కావడం విశేషం. సినిమాకు పాజిటివ్ వైబ్స్ నేపథ్యంలో దీనిపై పెద్ద ఎత్తున స్పందనలు వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer