దీపిక మొగుడికి అతి ఎక్కువైంది..!

0

కరోనా వైరస్ సంక్షోభం ప్రపంచంలోని అన్ని దేశాలలో సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ పరిస్థితిని అరికట్టడానికి ప్రపంచం మొత్తం ఇప్పటికీ పోరాడుతోంది. సెలెబ్రెటీల నుండి సామాన్య ప్రజల దాకా స్వీయ నిర్బంధం చేసుకుంటూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. కోవిడ్-19 యొక్క వ్యాప్తిపై పోరాడటానికి ముందు జాగ్రత్త చర్యగా పౌరులు – ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు ఈ విధానాన్ని అనుసరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా తలపెట్టిన జనతా కర్ఫ్యూకు దేశ ప్రజానీకం చప్పట్లతో సాయంత్రం 5 గంటలకు అందరూ ఇంటి గుమ్మం ముందుకు వచ్చి దేశ శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైద్యులు – అధికారులు – కార్మికులు – పోలీసులందరికీ కరతాళ ధ్వనులతో తమ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ స్వీయ నిర్బంధంలో వివిధ పనులు చేస్తూ వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

ఎప్పుడూ సోషల్ మీడియాలో వెరైటీ పోస్టులతో దర్శనమిచ్చే దీపికా పడుకొనే మొగుడు..అదేనండి రణవీర్ సింగ్ మరో చమత్కరమైన ఫొటో పోస్ట్ చేసాడు. ఈ ఫోటోపై నెటిజన్లు రకరాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గల్లీ బాయ్ సినిమా ఇచ్చిన హిట్ తో ఊపు మీదున్న ఈ బాయ్ అప్పుడప్పుడు ఇలాంటి పోస్టులు పెడుతూ అందరూ తన గురించి మాట్లాడేలా చేసాడు. ఈ ఫొటోలో రణవీర్ తెల్లటి కళ్ళు మరియు ఉంగరాల జుట్టుతో ఉబ్బిన జోంబీగా కనిపిస్తున్నాడు. ఎరుపు రంగు దుస్తుల్లో రణ్వీర్ నిజంగా రాక్షసుడిలా కనిపిస్తున్నాడు. అంతేకాకుండా స్వీయ నిర్బంధం నుండి ఇలా బయటకి వస్తాను అంటూ కామెంట్ పెట్టి అందర్నీ నవ్విస్తున్నాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు దీపికా మొగుడికి అతి ఎక్కువైందని కామెంట్ చేస్తున్నారు. రణవీర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-