కపిల్ ను దించేసిన సింగు గారు!

0

బాలీవుడ్ లో గత కొంత కాలంగా బయోపిక్స్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం సెట్స్ మీద కూడా కొన్ని క్రేజీ బయోపిక్స్ ఉన్నాయి.. అందు లో కపిల్ దేవ్ బయోపిక్ ఒకటి. కబీర్ ఖాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ’83’. ఈ సినిమాలో కపిల్ పాత్ర లో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. తాజాగా ’83’ ఈ సినిమా నుండి ఒక పోస్టర్ స్టిల్ రిలీజ్ చేసింది.

రణవీర్ కూడా ఈ పోస్టర్ ను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసి “నటరాజ్ షాట్” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఎంఎస్ ధోనికి హెలికాప్టర్ షాట్ ఎలా ట్రేడ్ మార్క్ లా క్రికెట్ ప్రేమికుల మనసుల్లో ముద్రించుకు పోయిందో.. ఈ నటరాజ్ షాట్ కపిల్ కు ట్రేడ్ మార్క్ షాట్ లా నిలిచి పోయింది. ఆ షాట్ లో కపిల్ నిలుచున్న భంగిమ నట రాజస్వామి విగ్రహాన్ని పోలి ఉంటుంది. ఈ పోస్టర్లో రణవీర్ అచ్చు గుద్దినట్టుగా కపిల్ దేవ్ తరహా లో కనిపిస్తున్నాడు. ఆ షాట్ ను మక్కికి మక్కి దించేసి కాపీ పరిక్ష లో భలే గా ఉత్తీర్ణుడయ్యాడు! ఈ పోస్టర్ కు సోషల్ మీడియా లో భారీ రెస్పాన్స్ దక్కుతోంది.

రణవీర్ ఈ సినిమా కోసం తీవ్రం గా క్రికెట్ ప్రాక్టీస్ చేయడ మే కాకుండా కపిల్ వద్ద సూచనలు సలహాలు కూడా తీసుకున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే అవన్నీ ఫలించినట్టు అనిపిస్తోంది. ఈ సినిమా లో రణవీర్ సతీమణి దీపిక పదుకొనే ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ’83’ వచ్చే ఏడాది ఏప్రిల్ 10 తారీఖున విడుదల కానుంది.
Please Read Disclaimer