బన్నీ సినిమా వదులుకున్న సీనియర్ ఆర్టిస్ట్!

0

అల్లు అర్జున్ త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా నుంచి రావు రమేష్ తప్పుకున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆమేరకు అంతర్గతంగా బయటికి వచ్చేసినట్టుగా తెలిసింది. కారణం స్పష్టంగానే ఉందట. ముందు అనుకున్న ప్రకారం రెండు నెలల కాల్ షీట్స్ ఇచ్చిన రావు రమేష్ తర్వాత ఏవో కారణాల షెడ్యూల్స్ మారడంతో వాటిని పొడిగించలేకపోయారు.

ఈలోగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరులో మరో కీలక పాత్ర అనిల్ రావిపూడి ఆఫర్ చేయడంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రావు రమేష్ తనకు బాగా ఇష్టమైన త్రివిక్రమ్ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని తెలిసింది. రెండూ సంక్రాంతి రిలీజ్ నే టార్గెట్ పెట్టుకున్నాయి కాబట్టి అడ్జస్ట్ మెంట్ సాధ్యం కాదు

ఇప్పుడు ఆ స్థానంలో అమృతం ఫేమ్ హర్షవర్ధన్ ను తీసుకున్నట్టుగా ఫ్రెష్ అప్ డేట్. ఇప్పటికే కొన్ని సన్నివేశాలు షూట్ చేయడం పూర్తయ్యిందట. ఇటీవలే బ్రోచేవారెవరురాలో ఫిషింగ్ ఎస్ ఐగా మెప్పించిన హర్షవర్ధన్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. కాకపోతే అతని ప్రతిభకు తగ్గట్టు అవకాశాలు ఇవ్వలేదో లేక ఆయనే ఒప్పుకోలేదో తెలియదు కానీ అప్పుడప్పుడు మాత్రమే తెరపై కనిపించే ఇతను ఇప్పుడు మాత్రం బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. రావు రమేష్ వదిలిన పాత్ర అంటే ఖచ్చితంగా స్పాన్ ఎక్కువ ఉన్నదే అయ్యుంటుంది. మంచి టైమింగ్ తో పాత్రలను పండించే హర్షవర్ధన్ కు ఇది కనక హిట్ అయితే బూరెల బుట్టలో పడ్డట్టే
Please Read Disclaimer