కేజీఎఫ్ స్టార్ దంపతులకు అరుదైన గిఫ్ట్

0

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. ఒకే ఒక్క `కేజీఎఫ్` అతడి ఫేట్ నే మార్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇకపోతే కేజీఎఫ్ స్టార్ యశ్ ఫ్యామిలీ లైఫ్ గురించి తెలిసిందే. అతడు అందాల కథానాయిక రాధిక పండిట్ ని పెళ్లాడాడు. ఈ జంటకు ఇదివరకూ ఓ ఆడపిల్ల జన్మించింది.

తనకు కూతురు పుట్టడం అరుదైన హ్యాపీ మూవ్ మెంట్. బిడ్డొచ్చిన వేళా విశేషం.. అదే నెలలో `కేజీఎఫ్` రిలీజై బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం.. యశ్ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసలు దక్కించుకోవడం గొప్ప మూవ్ మెంట్ ఆ జంటకు. అందుకే యశ్ – రాధికా పండిట్ దంపతులు తమ బిడ్డకు సంబంధించిన ప్రతి ఒక్క మెమరీని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఫోటో- రెమెడీస్ రూపంలో దాచుకోవాలనుకుంటున్నారు.

అయితే ఈ ఆకాంక్షను గ్రహించిన రాధికా పండిట్ మేకప్ మేన్ ఆ జంట కూతురు చిట్టి పాదాలు లేలేత చేతుల గుర్తులు తీసుకుని వాటికి ఫోటో ఫ్రేమ్ ని రూపొందించి కానుకగా ఇచ్చారు. దీంతో ఆ స్టార్ కపుల్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇది తమ జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకం. కూతురు పెద్దయ్యాక తన చిట్టి చేతుల్ని.. బుజ్జి పాదాల్ని తనకు చూపించాలనేది ఆ జంట కోరిక. రాధిక పండిట్ ప్రస్తుతం రెండోసారి ఫ్రెగ్నెన్సీతో ఉన్నారు. ఈ సందర్భంగానూ యశ్ ఎంతో కేరింగ్ గా ఉంటున్నాడట. ఈ మూవ్ మెంట్ గురించి తెలిసిన అభిమానులు చాలా ఎగ్జయిటింగ్ గా ఉన్నారు. యశ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎంతో వేగంగా దూసుకుపోతోందని కితాబిచ్చేస్తున్నారు. `కేజీఎఫ్ 2` రిలీజ్ టైమ్ కి మరో గుడ్ న్యూస్ చెబుతాడనే ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈసారి జూనియర్ రాకింగ్ స్టార్ పుడతాడో లేక మరోసారి జూ.రాధికనా? అన్నది చూడాలన్నది ఫ్యాన్స్ ఆశ అట.

 

View this post on Instagram

 

This definitely is going to be my most favourite piece of art ❤ @iamradhikapandit

A post shared by Yash (@thenameisyash) on
Please Read Disclaimer