రాశీ ..నవ్వుతూ నరకం చూపించకు!

0

చిరునవ్వుల వరమిస్తే చితి నుంచి లేచొస్తాను! అని 60 ప్లస్ పండు ముసళ్లు సైతం ఆ నవ్వుకు ఫిదా అయిపోవడం ఖాయం. నవ్వుతూ నరకం చూపించడమెలానో రాశీనే అడగాలి. ఇంత అందమైన నవ్వు వేరొక బ్యూటీలో చూడగలరా? అంతందంగా నవ్వేస్తుంది కాబట్టే జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ని డ్రైవ్ చేస్తోంది. లవ్ అండ్ లాఫ్టర్! చుట్టూ పరిచేస్తున్నా!! గ్రేట్ సండే!!! అంటూ ఈ ఫోటోని ఇలా షేర్ చేసిందో లేదో ఫ్యాన్స్ లోకి వైరల్ గా దూసుకెళ్లిపోతోంది. నవ్వులు చిందిస్తూనే రెడ్ హాట్ డ్రెస్ లో మైమరిపిస్తోంది.

అన్నట్టు రాశీ ఖన్నా హైదరాబాద్ పరిశ్రమకు వచ్చాక ఇక్కడే సొంతంగా ఇల్లు కొనుక్కుని సెటిలైంది. తెలుగు భాషను పూర్తిగా మమకారంతో నేర్చుకుంది. ప్రస్తుతం పీఆర్ ని ప్రాపర్ గా మెయింటెయిన్ చేస్తూ కెరీర్ పరంగా డోఖా లేకుండా చూసుకుంటోంది. అందుకే జయాపజయాలతో సంబంధమే లేకుండా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇంతకీ కెరీర్ మ్యాటరేమిటి? అంటే .. వరుణ్ సరసన `తొలి ప్రేమ`తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా నితిన్ తో `శ్రీనివాస కళ్యాణం` ఫ్లాపవ్వడం నిరాశపరిచింది. ఆ క్రమంలోనే ఇటీవలే తమిళ పరిశ్రమ వైపు వెళ్లింది. అక్కడ విశాల్ `అయోగ్య` (టెంపర్ రీమేక్) తో విజయం అందుకుని ఖుషీ అయ్యింది.

ప్రస్తుతం టాలీవుడ్ లో వెంకీ మామ చిత్రంలో నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ – నాగచైతన్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాశీ పాత్ర సంథింగ్ స్పెషల్ గా ఉంటుందట. మరోవైపు `సైతాన్ కా బచ్చా` అనే హారర్ చిత్రంలో నటిస్తోంది. సంగ తమిజాన్.. కడైసి వివాసయై అనే మరో రెండు తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లో విజయ్ సేతుపతి కథానాయకుడు. కోలీవుడ్ స్టార్ హీరోగా సేతుపతి స్థాయి ఓ లెవల్లో ఉండడం రాశీకి కలిసొస్తుందనడంలో సందేహమే లేదు. ఇక తెలుగులోనూ గ్రాఫ్ పెంచుకునేందుకు చిరునవ్వుల రాశీ తీవ్రంగానే ప్రయత్నిస్తోందట. అయితే వెంకీమామ రిజల్ట్ ని బట్టి ఇక్కడ ఛాన్సులు పెరుగుతాయేమో చూడాలి.
Please Read Disclaimer