ఇన్నేళ్ల వెయిటింగ్ ఫలించి ఎట్టకేలకు!

0

ఓపిగ్గా ఎదురు చూస్తేనే జయం కలుగుతుంది. సరైన బ్రేక్ వచ్చే వరకూ సహనం తప్పనిసరి. బ్రేక్ వచ్చాక నెమ్మదిగా అవకాశాలు వస్తాయి. అలా కాకుండా కంగారు పడి అంతా అయిపోయింది ఇక ఇక్కడేమీ చేయలేం అని అనుకుంటే నెగ్గుకు రావడం కష్టం. బోలెడంత టైమ్ వేస్ట్ అవుతుంది.. ఆశించినది దక్కదు. పాజిటివిటీతో దూసుకుపోయే వాళ్లకు తెలుగు సినీపరిశ్రమ విజయాల్ని కట్ట బెడుతుంది. మంచి అవకాశాల్ని అందిస్తుంది. ఈ తరహా లక్షణాలు నేటితరం నాయికల్లో ఎవరికి ఉన్నాయి? అంటే వెంటనే వినిపించే పేరు రాశీ ఖన్నా.

అసలు ఈ భామకు కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయాలే లేవు. కానీ జయాపజయాలతో సంబంధం లేకుండా నెట్టుకొచ్చేస్తోంది. దాదాపు ఆరేళ్ల పాటు టాలీవుడ్ నే అంటి పెట్టుకుని ఉంది. తనకు తొలి అవకాశం ఇచ్చిన ఈ పరిశ్రమలోనే సత్తా చాటాలని డిసైడ్ అయిపోయి ఎంతో సహనంతో లక్ చెక్ చేసుకుంది. నాగశౌర్య లాంటి చిన్న హీరోతో కెరీర్ మొదలు పెట్టి.. ఇప్పుడు ఏకంగా పెద్ద స్థాయి హీరోల సరసన నటించేందుకు రెడీ అవుతోంది. ఓవైపు కుర్ర హీరోలకు ఈ భామ బెస్ట్ ఆప్షన్ గా మారింది. సాయిధరమ్- సందీప్ కిషన్ – వరుణ్ తేజ్ లాంటి హీరోల సరసన నటించింది. రవితేజ లాంటి మాస్ హీరో ఛాన్సిచ్చాడు.

ఇప్పుడు ఏకంగా పెద్ద హీరోల కళ్లు ఈ అమ్మడి పైకి ప్రసరిస్తున్నాయట. మరోవైపు తమిళంలోనూ ఇటీవల విశాల్ సరసన టెంపర్ రీమేక్ అయోగ్య లో నటించి విజయం అందుకుంది. అటుపై అక్కడా కుర్ర హీరోలతో పాటు పెద్ద హీరోలు ఛాన్సులిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. అందం ఉంది.. ప్రతిభ ఉంది.. దానికి మించి ఓటమి వేళ ఓపిగ్గా ఎదురు చూసే గొప్ప స్వభావం ఉంది. అందుకే ఈ ధీక్ష ఎట్టకేలకు ఫలించి వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయట. ఆరేళ్ల వెయిటింగ్ ఫలించినట్టే మరి. ఎలానూ హైదరాబాద్ కే షిఫ్టయ్యింది కాబట్టి రాశీ ఖన్నాపై మన దర్శకనిర్మాతలకు గురి కుదిరి పెద్ద ఆఫర్లు ఇస్తున్నారట. ఇటీవల కొన్ని వరుస ఫ్లాపులొచ్చినా తిరిగి కంబ్యాక్ అయిన తీరు ఇంట్రెస్టింగ్. నైస్ జర్నీ.. నైస్ ప్రోగ్రెస్ రాశీ! త్వరలో రాబోతున్న ప్రతిరోజు పండగే తో మరో హిట్టు కొడుతుందేమో చూడాలి.
Please Read Disclaimer