ప్రముఖ లేడీ యాంకర్ కి కరోనా…!

0

కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు చాలామంది దీని బారిన పడ్డారు. టాలీవుడ్ లో కూడా అనేకమంది ప్రముఖులకు కరోనా సోకగా.. చికిత్స తీసుకొని బయటపడ్డారు. ఇటీవల కమెడియన్ సుధీర్ కు కూడా కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై సుధీర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో సదరు వార్తలు నిజమేనని అందరూ అనుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా ప్రముఖ లేడీ యాంకర్ రష్మీ గౌతమ్ కరోనా బారినట్లు తెలుస్తోంది. స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఆమె కోవిడ్ టెస్ట్ చేయించుకోగా రిపోర్టులో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రష్మీ అధికారికంగా వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఈ నెల 28 వరకు ఆమె యాంకరింగ్ చేస్తున్న ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ షూటింగ్ కార్యక్రమాలను రద్దు చేసుకుందని తెలుస్తోంది. ఒకవేళ ఆ సమయానికి కూడా రష్మీ రికవర్ అవ్వకపోతే నవంబర్ మొదటి వారంలో షూటింగ్ చేస్తారని సమాచారం. కాగా రష్మీ గౌతమ్ ఓ వైపు బుల్లి తెరపై యాంకర్ గా కొనసాగుతూనే.. వెండి తెరపై కూడా మెరిసింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న రష్మీ.. ప్రస్తుతం నందు హీరోగా నటిస్తున్న ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమాలో నటించింది. ఇటీవల రష్మీ దసరా ప్రత్యేక ఈవెంట్స్ కు సంబంధించిన షూటింగులో కరోనా సోకిందని అనుకుంటున్నారు.