సూపర్ ఉమెన్ అని ఎత్తేయకండి ప్లీజ్!

0

సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్ గా ఉండే యాంకర్లలో మొదటి వరసలో ఉంటుంది రేష్మి గౌతమ్. ఆమె ఎక్కువగా వివాదాస్పద కామెంట్లతో నెటిజనులను ఆకర్షిస్తుంటారు. ఇదే వేదికపై అందాల ఆరబోత ఫొటో షూట్లతోనూ విరుచుకుపడుతుండడం రేష్మి స్టైల్. ఇలా కుర్రకారును కవ్వింతల్లో ముంచెత్తుతూ తన నామ జపం చేసేలా ఏదొకటి చేస్తుంటుంది ఈ బబర్దస్త్ యాంకర్. కొన్ని సార్లు ఈమె చేసిన ఫొటోషూట్లు.. కొన్ని కామెంట్లు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో ఎక్కువగా నీతులు చెప్పే ఈ అమ్మడిని నెటిజనులు అలానే ఆడేసుకోవడం చూస్తున్నదే. “ముందు నువ్వు పాటించి చూపించు.. తర్వాత ఇతరులకు చెప్పు“ అంటూ నెటిజనులు సింగులర్ లో విమర్శలు చేయడం ఇంతకుముందు వివాదాస్పదమైంద. ఇటు బుల్లి తెర యాంకరింగ్ లో రాణిస్తున్న రేష్మి అటు సినిమాల్లోనూ అవకాశం వచ్చినప్పుడు వేడెక్కిస్తూనే ఉంది. ఈ భామ ఎక్కువగా రొమాంటిక్ మూవీల్లోనూ నటించి యువత గుండెల్లో తిష్ట వేయాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే ఈ మధ్య ఈమె సోషల్ మీడియాతో పంచుకున్న ప్రతి అంశమూ వివాదాస్పదమవుతుంది.

తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా రేష్మి ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్య దుమారం రేపింది. తొలి ట్వీట్లో మమ్మల్నిసూపర్ ఉమెన్ చేయడం ఆపండి అని పోస్టు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా మలి ట్వీట్ మాత్రం ఆమె వ్యంగంగా స్పందించారు. ఇదేమిటంటే ఓ మహిళ ఎనిమిదేళ్ల నుంచి న్యాయం కోసం ఎదురు చూస్తున్న దేశంలో .. మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం!! హ్యాపీ ఉమెన్స్డే అంటూ ట్వీట్ చేశారు. ఇది ఢిల్లీలో నిర్భయ దోషులకు ఇంత వరకు ఉరి శిక్ష అమలు కాకపోవడంతో ఆమె ఆవేదనగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నిర్భయ తల్లి ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. చాలా కొద్ది మంది మాత్రం రేష్మి అడిగిన దానిలోనూ నిజం ఉంది కదా అని కొంత సపోర్టు చేస్తున్నారు. అయితే రేష్మికి ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లోనే సామాజిక అంశాలుఏ గుర్తుకొస్తాయా అంటూ వ్యంగాస్త్రాలు విసురుతున్నారు. అవును రేష్మి నువ్వు ప్రతి రోజూ నీ షోలలో ఇలాంటి అంశాల గురించి మాట్లాడుతూ ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురుకాదు కదా అంటూ మరో వర్గం నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-