పెళ్లితో శుభం కార్డ్ వేసేస్తే ఎలా?

0

జబర్ధస్త్ యాంకర్ రష్మితో సుడిగాలి సుధీర్ మధ్య ర్యాపో గురించి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్యా స్నేహం మాత్రమే కాదు లవ్ ఉందని అభిమానులు అంటారు. పైగా.. ఆరేళ్ల నుంచి రష్మీకి ట్రై చేస్తున్నా పడలేదు! అంటూ సుధీర్ సరదాగా నవ్వేస్తూ హింట్ ఇస్తుంటాడు. దీంతో జబర్థస్త్ వీరాభిమానుల్లో ఆ ఇద్దరి మధ్యా అంతకుమించి ఇంకేదో జరుగుతోంది అన్న సందేహం అలానే ఉంది.

అయితే ఇవే ప్రశ్నల్ని నేరుగా రష్మీనే అడిగేస్తే గరంగరంగానే ఆన్సర్స్ ఇచ్చింది. ఇంతకీ మీ మధ్య బాంధవ్యానికి శుభం కార్డ్ వేయరా? అని ప్రశ్నిస్తే.. “షోలు ఇంకా నడుస్తున్నప్పుడు అప్పుడే శుభం కార్డు ఎలా వేస్తాం“ అంటూ సీరియస్ గానే స్పందించింది. శుభం కార్డ్ పడాల్సింది షోలకు కాదు.. మీ ఎఫైర్ కి.. రూమర్లకు! అంటూ రెట్టించి అడిగేస్తే మరింతగా సీరియస్ అయ్యింది.

దానికీ రష్మీ ఘాటుగానే స్పందించింది. ఎవరో ఒకరు ఏదో ఒకటి ఊహించుకుని ప్రచారం చేసేస్తే అది మీ ఇష్టం. పాపం వాళ్లను కూడా బతకనివ్వాలి కదా! అంటూ డిప్లమాటిక్ గా స్పందించింది. యూట్యూబ్… టీవీ చానెల్స్ పొట్ట కొట్టలేనని కూడా రష్మీ లైట్ తీస్కుంది. అయినా షోలో మా మధ్య ఒక ట్రాక్ నడుస్తుంటే మీకేంటి సమస్య? అని ఎదురు ప్రశ్నించింది. అంతేనా.. “ నేను ఒక్కమాటలో సమాధానం ఇచ్చేస్తే వాళ్ల పొట్టలు కొట్టినదాన్ని అవుతాను. నేను ఎందరికో అన్నం పెడుతున్నాననుకుంటా“ అంటూ గడుసరి సమాధానమే ఇచ్చింది రష్మి. అయినా ఇన్ని తిప్పలు పడే కంటే కొలీగ్ అనసూయను చూసైనా ఎవరైనా పిల్లాడిని వెతుక్కుని పెళ్లాడేస్తే ఇలాంటి గాసిప్పులే ఉండవు కదా! అని అభిమానులు రేష్మికి సూచిస్తున్నారు.
Please Read Disclaimer